ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అర్హత పరీక్ష పాస్ కాకుండానే డాక్టర్లు గా చలామణి అవుతున్న 73 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అలాగే వారికి అనుమతి ఇచ్చిన 14 రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ పై కూడా కేసు పెట్టింది. 

విదేశాల్లో చదివి ఇండియాలో తప్పనిసరిగా రాయాల్సిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) అర్హత పరీక్షను పాస్ కాకుండా ప్రాక్టీస్ నిర్వహిస్తున్న 73 మంది డాక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అర్హత లేకుండా మెడిసిన్ గ్రాడ్యుయేట్లను ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇచ్చిన 14 రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్ పై కూడా కేసు బుక్ చేసింది. ఈ మేరకు 91 చోట్ల సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది.

120కి పైగా క్షిపణులతో భారీ అటాక్.. ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా.. !

ప్రస్తుతం మన దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఇతర దేశంలో వైద్య విద్యను అభ్యసించిన గ్రాడ్యుయేట్ భారత్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలంటే మన దేశంలో ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిన్స్ లో తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో రిజిస్టర్ అవ్వాలంటే ముందుగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఎఫ్ఎంజీఈ/ స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించాలి. 

Scroll to load tweet…

ఈ పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్థులకు, అలాగే ఆయా రాష్ట్రాల కౌన్సిల్స్, నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ కు ఉత్తీర్ణతకు సంబంధించిన వివరాలను ఎన్ బీఈ చేరవేస్తుంటుంది. దీని వల్ల ఏదైనా సందర్భంలో అభ్యర్థులు నకిలీ అర్హత ధృవీకరణ పత్రాలను సమర్పించినప్పుడు మెడికల్ కౌన్సిల్స్ నేరుగా ఎన్ బీఈ పంపించిన ఫలితాల్లో క్రాస్ చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

చిన్ననాటి స్నేహితురాలు రాధిక‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

అయితే తాజాగా నమోదైన కేసుల్లో అభ్యర్థులకు కౌన్సిల్స్ ఎలా అనుమతి ఇచ్చాయనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ ఘటనలో అవినీతి, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం ఆరోపణలపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్, మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు 73 మంది విదేశీ వైద్య పట్టభద్రులపై సీబీఐ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.