జీవితాంతం కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేశాడు. ఇద్దరూ అబ్రాడ్‌లో సెటిల్ అయ్యారు. కానీ, ఆ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ మరణించాడు. తండ్రిని కడసారి చూడటానికి కూడా పిల్లలు రాలేదు. దీంతో పోలీసు, స్థానికులు కలిసి ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
బెంగళూరు: కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బెల్గాం జిల్లా చిక్కోడి తాలూకా నగరమునవళ్లి గ్రామంలో ఓ పెద్ద మనిషి మరణించాడు. ఆయన ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. 72 ఏళ్ల వయసులో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అనంతరం, చికిత్స పొందుతూ మృతి చెందాడు. జీవితకాలమంతా కష్టపడి పిల్లలకు ఉన్నత విద్యనందించాడు. మంచి భవిష్యత్‌ను సమకూర్చాడు. ఆయన ఇద్దరు పిల్లలూ అబ్రాడ్‌లో సెటిల్ అయ్యారు. కానీ, ఆ పెద్దయాన చరమాంకంలో మాత్రం కన్న పిల్లలు కడసారి చూపునకు కూడా నిరాకరించారు. దీంతో ఓ పోలీసు అధికారి, మరికొందరు స్థానికులు కలిసి ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ పెద్ద మనిషి పేరు మూల్ చంద్ర శర్మ. ఆయన జీవితకాలమంతా కష్టపడి పిల్లలకు మంచి విద్యనందించాడు. వారు అబ్రాడ్‌లో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. బిడ్డ కెనడాలో, కొడుకు సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు. ఇంత కష్టపడ్డ ఆ తండ్రిని కడసారి చూడటానికి మాత్రం వారిద్దరూ రాలేదు.
హార్ట్ స్ట్రోక్‌తో బాధపడుతున్న మూల్ చంద్ర శర్మ తన మిత్రుడితో కలిసి నగరమునవళ్లికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చాడు. ఆయన బాగోగుల కోసం వారు ఓ కాంట్రాక్టు వర్కర్‌ను కుదిర్చారు. కానీ, కాంట్రాక్ట్ ఫినిష్ కావడంతో మూల్ చంద్ర శర్మను ఓ లాడ్జీలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. స్థానికులు చిక్కోడి పీఎస్ఐ బాసగౌడకు సమాచారం అందించడంతో మూల్ చంద్ర శర్మకు ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఆ తర్వాత బెల్గాం జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మూల్ చంద్ర శర్మ మరణించాడు.
Also Read: బిడ్డకు లెక్కల్లో సున్నా మార్కులు.. తల్లి స్పందనకు నెటిజన్లు ఫిదా.. వైరల్ పోస్టు ఇదే
మూల్ చంద్ర శర్మ పిల్లల కోసం ఫోన్లు చేశారు. ఆమె బిడ్డ చాలా కటువుగా మాట్లాడింది. ఆయనతో తనకేమీ సంబంధం లేదని, ఆయన అంత్యక్రియల్లో భాగం పంచుకోవాలని అనుకోవడం లేదని చెప్పింది. ఆ డెడ్ బాడీని ఎక్కడైనా పడేయండి అని సూచించడంతో వారు చలించిపోయారు.
వారే స్వయంగా ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు పీఎస్ఐ బాసగౌడను ప్రశంసించారు. కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పట్టించుకోని ఆ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
