మహారాష్ట్రలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ హోటల్ గదిలో దిగిన దంపతులు తమ చిన్నారికి విషం పెట్టి తామూ తీసుకున్నారు. ఇందులో చిన్నారి చనిపోగా, తల్లి స్పృహ కోల్పోయింది. తండ్రి అదృశ్యమయ్యాడు. 

మహారాష్ట్ర : Maharashtraలోని థానేలోని ఓ Hotel roomలో ఆరేళ్ల బాలిక చనిపోగా, ఆమె తల్లి అపస్మారక స్థితిలో పడి ఉంది. మహిళ, ఆమె భర్త "Suicide contract" కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని మంగళవారం రోజు ఒక అధికారి తెలిపారు. ఈ ఘటన సోమవారం జరిగింది. అప్పటినుంచి మహిళ భర్త కనిపించకుండా పోయాడని తెలిపారు.

దంపతులు అప్పుల పాలయ్యారని, దీనినుంచి బయటపడడానికి పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలోని వాసాయి ప్రాంతంలో ఉన్న తమ ఫ్లాట్‌ను విక్రయించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. రేయాన్, పూనమ్ బ్రకో (30) అనే దంపతులు తమ కుమార్తె అనక్య (6)తో కలిసి శుక్రవారం థానేలోని మీరా రోడ్ ప్రాంతంలో ఉన్న హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆ తరువాత ఆదివారం రాత్రి తమ కూతురికి విషం కలిపిన ఆహారం తినిపించారని తెలిపారు. కూతురు తిన్న తర్వాత ఆ మహిళ కూడా ఆ విషం కలిపిన ఆహారాన్ని తిన్నంది. తాను తిన్న తరువాత ఆమె తన భర్తకు కూడా విషాన్ని ఇచ్చిందని, అతను కూడా దాన్ని తిన్నాడని ఆ పోలీస్ అధికారి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థకు తెలిపారు.

ఆదివారం-సోమవారంల మధ్య రాత్రి హోటల్ సిబ్బంది అ కుటుంబం ఉన్న గదికి వెళ్లారు. కాగా సోమవారం ఉదయం.. తన కూతురు అచేతనంగా పడి ఉందని ఆ మహిళ.. ఫిర్యాదు చేసిందని అధికారి తెలిపారు. వెంటనే హోటల్ సిబ్బంది కొంతమంది వైద్య నిపుణులను పిలిపించి పోలీసులు అప్రమత్తం చేశారు.

అప్పటికే చిన్నారి చనిపోవడంతో మైనర్ మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. గదిలో తనిఖీ చేసిన పోలీసులకు హోటల్ గదిలో పాయిజన్ బాటిల్‌ దొరికిందని ఆ అధికారి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

సోమవారం హోటల్ నుండి బైటికి వెళ్లిన మహిళ భర్త ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయాడు. అయితే, ఇది ముందుగానే పథకం ప్రకారం చేసుకున్న ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ జంట "ఆత్మహత్య ఒప్పందం" కుదుర్చుకున్నట్లు వారు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురూ విషం తీసుకున్నా.. తన భార్యపై విషం పని చేయడంలేదని తెలుసుకున్నాక, అతను భార్యను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, ఈ క్రమంలోనే ఆమె స్పృహతప్పి పడిపోయిందని అంటున్నారు. సదరు మహిళ గతేడాది వరకు స్కూల్ టీచర్‌గా పనిచేసినట్లు అధికారి తెలిపారు. భర్త ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో ఐదుగురు బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకా లోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టిందని తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు.