ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నాం 12.30 సమయానికి 12.3 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రాజనందర్ గామ్‌లో 39 శాతం పోలింగ్ నమోదవ్వగా.. సుకుమాలో 19 శాతం, జగదల్‌పూర్‌లో 17 శాతం, బస్తర్‌లో 18 శాతం పోలింగ్ నమోదైంది

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నాం 12.30 సమయానికి 12.3 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రాజనందర్ గామ్‌లో 39 శాతం పోలింగ్ నమోదవ్వగా.. సుకుమాలో 19 శాతం, జగదల్‌పూర్‌లో 17 శాతం, బస్తర్‌లో 18 శాతం పోలింగ్ నమోదైంది.

అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఉదయం దంతెవాడలోని ఓ పోలింగ్ కేంద్రానికి సమీపంలో మావోలు మందుపాతరను పేల్చారు. వెంటనే స్పందించిన భద్రతా దళాలు పేలకుండా ఉన్న మరో ఆరు బాంబులను నిర్వీర్యం చేసింది.