ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి తర్వాతి రోజున జజంగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. తోటి భక్తుల మాదిరిగా సీఎం కూడా కొరడా దెబ్బలు తిన్నారు. 

రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రిని కొరడా దెబ్బలు కొట్టడమా..? అంత ధైర్యం ఎవరికైనా వుందా..? ముందు కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం ఆయనకేంటీ..? ఇలాంటి డౌట్సే మీకు రావొచ్చు. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జజంగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని అక్కడి గ్రామస్తుల నమ్మకం. ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజలో పాల్గొన్న ఆయన గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. తోటి భక్తుల మాదిరిగా సీఎం కూడా కొరడా దెబ్బలు తిన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా వుండాలని ఆయన ప్రార్ధించారు. అన్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రతి ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటూ వస్తున్నారు.