ఆటోను మూడు చక్రాలపై కాదు.. ఒక టైర్‌ను గాల్లో ఉంచి రెండు టైర్‌లపైనే నడిపి ఓ వ్యక్తి ప్రపంచరికార్డు బద్ధలు కొట్టాడు. ఈ వీడియోను స్వయంగా వరల్డ్ రికార్డు గిన్నిస్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది 

న్యూఢిల్లీ: సినిమాల్లో rajani kanth స్టైల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతుంటాయి. ఆయన సిగరెట్ వెలిగించినా, నోట్లో బబుల్ గమ్ వేసుకున్నా, ఫైట్ చేసినా, గన్ కాల్చినా ఏదైనా తనదైన స్టైల్‌తో ప్రత్యేక ముద్ర వేస్తారు. అదే తరహాలో సినిమాల్లో కాదు.. నిజ జీవితంలోనే ఓ వ్యక్తి తనదైన స్టైల్‌లో auto నడిపాడు. సాధారణంగా బైక్‌‌ను ఒక్క tyre పైకి లేపి స్టంట్లు వేస్తుంటారు. కానీ, ఆయన ఇదే ఫీట్ ఆటోతో చేశాడు. మూడు చక్రాలున్న ఆటో నడుపుతూ ఒక టైర్‌ను గాల్లోకి లేపి వేస్తున్న చక్కర్లు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.

View post on Instagram

ఆటోను మూడు చక్రాలపై కాకుండా, రెండు చక్రాలపై నడిపి తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ జగదీశ్ ఎం వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు. ఆయన రెండు చక్రాలపైనే ఆటోను కనీసం 2.2 కిలోమీటర్లు నడిపాడు. బాలీవుడ్ స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆ వీడియోను guinness world record ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సినిమాటిక్‌గా కనిపిస్తున్నా అంతటి స్టంట్‌ను జగదీశ్ సులువుగా వేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఐదు లక్షలకు వ్యూస్ చేరువవుతున్నాయి. 

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన రియాక్షన్స్ ఇచ్చారు. కొందరేమో అసలైన రజనీకాంత్ అని, ఇంకొందరు ఇది భారత్‌లో చాలా సాధారణమని కామెంట్లు చేశారు.