Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. పెళ్లి పేరుతో 100 మంది అమ్మాయిల మోసం.. చివ‌రికి ఏమైందంటే ?

పెళ్లి చేసుకుంటానని చెప్పి 100 మంది అమ్మాయిలను మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మోట్రిమోనియల్ సైట్ల ద్వారా అమ్మాయిలతో పరిచయం చేసుకొని, వారి నుంచి ఇప్పటి వరకు లక్షల రూపాయిలు వసూలు చేశారు. 

Cheating on 100 girls in the name of marriage .. What happened in the end?
Author
New Delhi, First Published May 13, 2022, 5:18 PM IST

అత‌డు ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివాడు. అయితే ఏం.. మోసాలు చేయ‌డంలో పెద్ద పెద్ద డిగ్రీలే చేశాడు. సోష‌ల్ మీడియా, మోట్రిమోనియ‌ల్ సైట్ల‌లో పెళ్లి కాని అమ్మాయిలే ల‌క్ష్యంగా చేసుకుంటాడు. తన‌కు పెళ్లి కాలేద‌ని, బిజినెస్ చేస్తుంటాన‌ని అమ్మాయితో ప‌రిచయం చేసుకుంటాడు. వారితో సన్నిహితంగా మెలిగి ఏదో అవ‌స‌రం పేరు చెప్పి డ‌బ్బులు అడుగుతాడు. అత‌డి మాట‌లు న‌మ్మిన అమ్మాయిలు అడిగినంత డ‌బ్బు ఇచ్చేస్తారు. చివ‌రికి ప‌త్తా లేకుండా పోతాడు. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు వంద మోసాలు చేశాడు. 

నిందితుడు ఫ‌ర్హాన్ ఖాన్ . ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. కేవలం 12వ తరగతి పాస్ అయ్యాడు. విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపే అల‌వాటు ఉన్న ఫ‌ర్హాన్ కు అమ్మాయిల‌ను మోసం చేయ‌డ‌మే టార్గెట్ గా పెట్టుకున్నాడు. మోట్రిమోనియ‌ల్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మాయిలో ప‌రిచ‌యం పెంచుకునేవాడు. తనకు వ్యాపారం ఉందని, ఎంబీఏ, ఇంజినీరింగ్‌ చదివానని అత‌డు అమ్మాయిల‌తో చెప్పేవాడు. వారి మ‌న‌సును దోచుకునేవాడు. త‌రువాత ఏదో ఒక సాకు చెప్పి వారిని డ‌బ్బులు అడుగుతాడు. త‌మ‌కు కాబోయే భ‌ర్తే క‌దా అని న‌మ్మి వారు అడిగినకాడికి ఇచ్చేసేవారు. త‌రువాత ఆ అకౌంట్ ల‌ను క్లోజ్ చేసేవాడు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు వంద మంది అమ్మాయిల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేశాడు. 

ఎలా దొరికిపోయాడంటే.. ? 
నిందితుడు ఎవ‌రికీ దొర‌కకుండా ఇలా ప‌క్క‌గా అమ్మాయిల వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసేవాడు. అయితే ఎప్ప‌టిలాగే జీవన్‌సతి మ్యాట్రిమోనియల్ పోర్టల్‌లో AIIMSకి చెందిన ఒక మహిళా డాక్టర్ తో అత‌డు ప‌రిచ‌యం పెంచుకున్నాడు. తన‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని, బిజినెస్ ఉంద‌ని ఆమెతో చెప్పాడు. ఆమె ఫ‌ర్హాన్ ఖాన్ చెప్పిన విష‌యాలు అన్నీ న‌మ్మింది. అయితే ఒక బిజినెస్ డీల్ చేసుకోవాల‌ని త‌న‌కు రూ.15 ల‌క్ష‌లు కావాల‌ని అత‌డు ఆ మ‌హిళా డాక్ట‌ర్ ను కోరాడు. అత‌డిని పూర్తిగా న‌మ్మిన ఆమె అడిగినంతా ఇచ్చేసింది. 

విదేశీ బాలికపై స్విమ్మింగ్ పూల్ లో, రిసార్ట్ గదిలో అత్యాచారం.. గోవాలో దారుణం...

త‌రువాత ఎప్ప‌టిలాగే త‌న అకౌంట్ల‌ను క్లోజ్ చేసి ఆమెతో సంభాష‌ణ‌ను నిలిపివేశాడు. దీంతో తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి ఆ డాక్ట‌ర్ మార్చి 26వ తేదీన సౌత్ ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీక‌రించిన డీసీపీ బెనిటా మేరీ నిందితుడిని ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందం 18 రోజుల పాటు ఆరా తీసి చివ‌రికి అత‌డిని పట్టుకుంది. ఫర్హాన్ ఖాన్ వద్ద నుంచి ఒక BMW కారు, అనేక ATMలు, SIM కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేప్ కేసులో బెయిల్‌పై నిందితుడు బయటకు.. బాధితురాలితోనే ప్రేమ పెళ్లి.. తల్లిదండ్రులకు రివర్స్ అయిన యువతి

ఫ‌ర్షాన్ ఖాన్ విచార‌ణ సంద‌ర్భంగా పోలీసులు ఎన్నో షాకింగ్ విష‌యాలు క‌నుగొన్నారు. అత‌డు ఇప్ప‌టి వ‌ర‌కు 100 వ‌ర‌కు ఇలాంటి మోసాలు చేశార‌ని తెలుసుకున్నారు. నిందితుడు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, కర్నాటక వంటి వివిధ రాష్ట్రాల్లో పలువురి మహిళలను మోసం చేసినట్టు గుర్తించారు. అత‌డు గత ఆరు నెలలుగా మహిళలను మోసం చేస్తున్నాడని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios