పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాజీనామా చేశారు. ఇకపోతే రాష్ట్ర కొత్త సీఎంగా ఆప్ నేత భగవంత్ సింగ్ మన్ మార్చి 15న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో గెలపొందిన అనంతరం ఆయన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ (Charanjit singh Channi) శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చన్నీ మాట్లాడుతూ.. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు.. పంజాబ్ సీఎంగా Bhagwant Singh Mann ఈ నెల 16వ తేదీన ప్రమాణం చేయనున్నారు. Punjab Assembly Election 2022 ఎన్నికల్లో AAP ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న Congress ను మట్టికరిపించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ సీఎం Arvind Kejriwal ను కూడా ఆహ్వానించారు భగవంత్ సింగ్ మాన్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భగవంత్ మాన్ సింగ్ శుక్రవారం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. పంజాబ్ ఎన్నికల పలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా భగవంత్ సింగ్ మాన్ కేజ్రీవాల్ తో భేటీ కావడం ఇదే తొలిసారి.
కేజ్రీవాల్ కాళ్లు మొక్కి భగవంత్ సింగ్ మాన్ ఆశీర్వాదం తీసకొన్నారు. భగవంత్ ను కేజ్రీవాల్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ నెల 16వ తేదీన భగవంత్ సింగ్ మాన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. మరో వైపు పంజాబ్ లో ఘన విజయం సాధించడంతో ఈ నెల 13న అమృత్ సర్ లో భగవంత్ సింగ్ మాన్ తో కలిసి కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు.
పంజాబ్‌లో ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.
పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్‌ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లలో, ఆప్ 20 చోట్ల గెలిచింది. ఎస్‌ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృత్వంలోని ఎస్‌ఏడీ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.
