Asianet News TeluguAsianet News Telugu

గుజ‌రాత్ మంత్రి వ‌ర్గంలో మార్పులు.. ఇద్దరు మంత్రుల నుంచి శాఖ‌ల తొల‌గింపు..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు మంత్రి వర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మంత్రుల నుంచి పలు శాఖలు తొలగించారు. వాటిని ఇతర మంత్రులకు కేటాయించారు. 

Changes in the Gujarat cabinet.. Removal of departments from two ministers..
Author
First Published Aug 21, 2022, 9:02 AM IST

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం భూపేంద్ర పటేల్ ఇద్దరు మంత్రుల నుంచి వారి శాఖ‌లు లాగేసుకున్నారు. ఈ ఆక‌స్మిక ప‌రిణామం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

శ‌నివారం రాత్రి రాజేంద్ర త్రివేది నుండి రెవెన్యూ శాఖ బాధ్యతలను తొల‌గించారు. అలాగే పూర్ణేష్ మోడీ నుంచి రోడ్లు, భవనాల శాఖను తీసుకున్నారు. ఈ రెండు శాఖ‌ల‌ను సీఎం భూపేంద్ర ప‌టేల్ వ‌ద్ద‌కు చేరుకున్నాయి. ఈ మేర‌కు గుజరాత్ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

కాటన్​కు బదులు కండోమ్ క‌వ‌ర్.. మధ్యప్రదేశ్ వైద్యుల నిర్లక్ష్యం..

అయితే విపత్తు నిర్వహణ, చట్టం, న్యాయం, శాసనసభ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను రాజేంద్ర త్రివేది నిర్వ‌హించ‌నున్నారు. అలాగే రవాణా, పౌర విమానయానం, పర్యాటకం, యాత్రికుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు పూర్ణేష్ మోడీ వ‌ద్ద‌నే కొన‌సాగుతున్నాయి.

భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని 10 మంది క్యాబినెట్ ర్యాంక్ మంత్రులలో త్రివేది, మోడీ ఇద్ద‌రు కొన‌సాగుతున్నారు. అయితే మోడీ ఆధ్వర్యంలోని రోడ్లు, భవనాల శాఖ పేలవమైన పనితీరు వ‌ల్ల‌, అలాగే  త్రివేది రెవెన్యూ శాఖను నిర్వహించడం పట్ల సీఎం, పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.

సంక్షేమ పథకాలను ఉచితాలుగా పిలువొద్దు.. డీఎంకే విజ్ఞ‌ప్తి

కాగా.. మంత్రుల నుంచి శాఖ‌లు తొల‌గించిన కొంత స‌మ‌యం త‌రువాత రెవెన్యూ శాఖ బాధ్యతలను హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి అప్పగించారు. అలాగే రోడ్లు, భవనాల శాఖను జగదీష్ పంచల్ కు అప్పగించారు. ఇదిలా ఉండ‌గా.. గత సెప్టెంబర్‌లో గుజరాత్ క్యాబినెట్ మొత్తాన్ని రాజీనామా చేయాలని బీజేపీ హైకమాండ్ కోరింది. దీంతో అప్పటి సీఎం విజయ్ రూపానీ సీఎంగా రాజీనామా చేసి భూపేంద్ర ప‌టేల్ ను సీఎం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

క‌న్న తండ్రి రాక్ష‌సుడ‌య్యాడు.. ఉద్యోగం లేదని.. 11నెలల చిన్నారిని నదిలో విసిరేశాడు.

ప్ర‌స్తుతం రెవెన్యూ శాఖ‌ల నుంచి ఉద్వాస‌న పొందిన రాజేంద్ర త్రివేదిను గుజరాత్ ప్రభుత్వంలో నెంబ‌ర్ 2 గా ప‌రిగ‌ణించేవారు. గ‌తేడాది భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజేంద్ర త్రివేదీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయ‌న త‌న‌ దేవాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ఉన్న ప‌లు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి సాహ‌సోపేత చర్య‌లు తీసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా వీడియోలు రావడంతో ఆయన ప్రత్యేక చ‌ర్చకు దారి తీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios