ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 లోని లాండర్ విజయవంతంగా చంద్రుని ధృవ ప్రాంతంలో అడుగుపెట్టింది. రోవర్ కూడా తన పనిని ప్రారంభించింది. అయితే అవి ఎన్ని రోజులు పని చేస్తాయి? అనే ప్రశ్న  తలెత్తుతుంది.

140 కోట్ల భారతీయుల ఆశలను తనతో మోసుకెళ్లిన చంద్రయాన్ 3 లోని లాండర్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం పై కాలు మోపింది. చంద్రుని దక్షిణ ధ్రువం పై కాలు మోపిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

అయితే ఈ మిషన్ లోని లాండర్, రో ఎన్ని రోజులు పని చేస్తాయి? ఇంతకీ వాటి పని ఏమిటి? వాటి జీవితకాలం ఎన్ని రోజులు? అనే సందేహాలు ప్రతి మదిని తోలుస్తున్నాయి. 
వాస్తవానికి ఈ మిషన్ లోని ల్యాండర్, రోవర్ లు కేవలం 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అయితే..ఆ తర్వాత వీటికి ఏం జరుగుతుంది. 

14 రోజుల పరిశోధన..

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 జూలై నింగికెగిసింది. దాదాపు 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆగస్టు 23 సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువం పై విజయవంతంగా ల్యాండ్ అయింది.

ఇలా చంద్రుని ముద్దాడిన లాండర్ దాని నుండి వెలువడిన రోవర్ 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేయనున్నాయి. ఈ మిషన్ లోని ల్యాండర్ గాని, రోవర్ గాని పనిచేయడానికి, అలాగే అవి సేకరించిన సమాచారాన్ని భూమికి పంపడానికి విద్యుత్ అవసరం. అందుకే చంద్రునిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ క్రమంలో ఈ మిషన్ లో ప్రధాన భాగాలైన లాండర్, రోవర్ కు అమర్చిన సోలార్ ప్యానల్ సౌర శక్తిని స్వీకరించి విద్యుత్ శక్తిగా మార్చుకుంటాయి. ఆ శక్తి ద్వారా ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి. 

14 రోజులు మాత్రమే ఎందుకు?

వాస్తవానికి చంద్రుని మీద ఒక్కరోజు 28 రోజులకు సమానం. అంటే.. ఇక్కడ 14 రోజులు పగలు ఉంటే.. 14 రోజులు రాత్రి ఉంటుంది.  ఈ క్రమంలో 14 రోజుల పగటి సమయంలో మాత్రమే ఈ ల్యాండర్, రోవర్లు పనిచేస్తాయి. తర్వాతి 14 రోజుల సమయంలో పూర్తి చీకటితో అత్యధిక శీతల ఉష్ణోగ్రతలు నమోదయితయి.    చంద్రుని మధ్య భాగంలో దాదాపు 110 డిగ్రీల నుండి 140 ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాగే రాత్రి సమయంలో మైనస్ 200 డిగ్రీల వరకు నమోదు కాగా. ధ్రువపు ప్రాంతాలలో ఆ ఉష్ణోగ్రతలు మరింత తక్కువకు పడిపోతాయి. 

ఇస్రో పంపిన లాండర్, రోవర్లు కూడా దక్షిణ ధ్రువంలోని 70 డిగ్రీల అక్షంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు మైనస్ 220 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయితయి. దీంతో లాండర్ గాని, రోవర్ గాని పూర్తి మంచుతో కప్పబడుతాయి. 

అంతటి కఠిన వాతావరణం లో ఉండే రోవర్లలోని బ్యాటరీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. లాండర్ లోని సోలార్ ప్యానల్ కూడా దాదాపు చెడిపోతాయి. ఒకవేళ 14 రోజుల తర్వాత .. రోవర్ పై సూర్య రశ్మి పడి తిరిగి పని చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని ఇస్రో చీప్ వెల్లడించారు. కానీ రోవర్ తిరిగి పునర్జీవనం పొందిన.. లాండర్ పనిచేయకపోతే ఫలితం ఉండదని, రోవర్ స్వీకరించిన సమాచారం భూమికి పంపించలేదని, సేకరించిన సమాచారం కేవలం లాండర్ మాత్రమే పంపిస్తుందని తెలిపారు.  ఒకవేళ 14 రోజుల తర్వాత లాండర్ తిరిగి పని చేస్తే.. అది స్వీకరించిన సమాచారాన్ని భూమికి పంపించగలదని వెల్లడించారు. అందుకే ఇవి 14 రోజులలోనే.. అవి చేయగలరని పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.