సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇస్రో యూట్యూబ్ ఛానెల్‌ను వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో లైవ్ స్ట్రీమింగ్‌ను 9.01 మిలియన్ల మంది వీక్షించారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ విజయవంతంగా జాబిల్లిపై దిగింది. సాయంత్రం 5.44 గంటల నుంచి ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం సాయంత్రం 6.04 గంటలకు సేఫ్‌గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇస్రో యూట్యూబ్ ఛానెల్‌ను వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో లైవ్ స్ట్రీమింగ్‌ను 9.01 మిలియన్ల మంది వీక్షించారు.

చంద్రయాన్-2 మిషన్ ఫెయిల్ అయినప్పటికీ, , భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన ప్రయోగాలతో చంద్రయాన్- 3 కి శ్రీకారం చుట్టింది. చంద్రుని మిషన్‌లో అమెరికా 26 సార్లు విఫలమైతే రష్యా 14 సార్లు విఫలమైనప్పటికీ భారత్ మాత్రం చంద్రయాన్ 3 దశల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది ఈ మిషన్ ప్రారంబించారు. 

చంద్రయాన్ మిషన్ ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. చంద్రయాన్ 3 తర్వాత కూడా పలు సంఖ్యలో మిషన్‌లను ప్రయోగించనుంది. రోవర్ అక్కడ తిరగడమే కాదు.. ఖనిజాలను పరిశీలించడం, చంద్రుడి మీద ఖనిజాలను తవ్వి తీయడం, ఆ తవ్వి తీసిన ఖనిజాలను భూమి పైకి తీసుకురావడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. అయితే.. నాసా తలపెట్టిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్ తరహాలో మనిషిని కూడా చంద్రుడి మీదికి పంపించే లక్ష్యం కూడా ఇస్రోకు ఉన్నదని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

ఇస్రో ప్రస్తుతం దాదాపు 50 దేశాలకు పైగా అనేక సంస్థలు ప్రభుత్వాలతో ఒప్పందాలు కలిగి ఉంది. కమ్యూనికేషన్ విభాగంలో ఇస్రో ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన, అలాగే తక్కువ ఖర్చుతో టెక్నాలజీని ఉపయోగిస్తుందనే పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చంద్రయాన్ ద్వారా ఇస్రోఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది తద్వారా ఇతర దేశాలు సైతం చంద్రుని పరిశోధనలో భాగస్వామ్యం అవడం ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చంద్రుడిపైన ఇస్రో ఇతర గ్రహాలపై వెళ్లేందుకు లాంచింగ్ స్టేషన్ కనుక ప్రారంభించినట్లయితే. ఇస్రో ఆధీనంలోని ఆ లాంచింగ్ స్టేషన్ ఉపయోగించుకునేందుకు పలు దేశాలు మనతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది తద్వారా రెవెన్యూ మరింత పెరుగుతుంది.