భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో శనివారం కీలక ఘట్టం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో శనివారం కీలక ఘట్టం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది. శనివారం సాయంత్రం 7.15 గంటలకు ఇస్రో ఈ ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. 18 రోజుల పాటు చంద్రుని కక్ష్యలో తిరిగిన అనంతరం ఈ నెల 23 లేదా 24న చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది.
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం( ఇస్రో) చంద్రయాన్ 3 జూలై 14న ప్రయోగించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ గతంలో అన్వేషించని చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద అంతరిక్ష నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 3వ సారి విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా, చైనా, రష్యా అనే మూడు దేశాలు మాత్రమే ఇప్పటివరకు చంద్రుని ఉపరితలంపైకి సురక్షితంగా వెళ్లాగలిగాయి. చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసి..చంద్రునిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించాలని భావిస్తుంది
