చందమామపై చంద్రయాన్ -3 సగర్వంగా సాఫ్ట్ ల్యాండ్ అయిన వేళ.. సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. సైకిల్ పై రాకెట్ విడిభాగాలను మోసుకెళ్తున్నట్టుగా ఉన్న ఆ ఫొటో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో చక్కర్లు కొట్టింది. 

యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన చంద్రయాన్ -3 సక్సెస్ అయ్యింది. బుధవారం సాయత్రం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపింది. దీంతో భారతదేశం సంబరాల్లో మునిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు, ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. 

Scroll to load tweet…

గతంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు రాకెట్ భాగాలను సైకిల్ పై మోసుకెళ్తున్న ఫొటో, పక్కనే చంద్రయాన్ -3 ను ఉంచిన ఫొటో నిన్నటి నుంచి వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్ లో సర్క్యూలేట్ అయ్యింది. ఇస్రో శాస్త్రవేత్తల కృషి అని అభినందించారు. రాకెట్ విడిభాగాలను నాడు సైకిల్ పై మోసుకెళ్లిన ఇస్రో.. నేడు రష్యా వంటి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసిందని ప్రశంసించారు. 

Scroll to load tweet…

తిరువనంతపురంలోని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కు ఇద్దరు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ముక్కు భాగాన్ని సైకిల్ పై మోసుకెళ్తున్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తోంది. దీనికి ‘‘ఇది స్ఫూర్తిదాయకం.. !! నిజంగా 'సైకిల్ సే చాంద్ తక్'! (సైకిల్ నుంచి చందమామ దాకా)’’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇస్రోను ప్రశంసలతో మంచెత్తారు.