ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం రెడీ అయ్యింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని ఇస్రో మంగళవారం ప్రకటించింది. మిషన్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోందని తెలిపింది. వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలకు గురవుతున్నాయని పేర్కొంది. 

చంద్రయాన్ -3కు సంబంధించిన తాజా అప్ డేట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం వెల్లడించింది. మూన్ మిషన్ షెడ్యూల్ ప్రకారమే పనిచేస్తోందని తెలిపింది. వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారని పేర్కొంది. మిషన్ ప్రయాణం సాఫీగా సాగిపోతోందని తెలిపింది. అంతా బాగానే ఉందని పేర్కొంది. మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (ఎంఓఎక్స్) శక్తి, ఉత్సాహంతో కళకళలాడుతోందని చెప్పింది.

సర్జికల్ స్ట్రైక్ జరగలేదు.. కేవలం ఉగ్రవాదుల చొరబాట్లను ఆర్మీ తిప్పికొట్టింది - భారత రక్షణ మంత్రిత్వ శాఖ

‘‘2023 ఆగస్టు 23న భారత కాలమానం ప్రకారం రాత్రి 17.20 గంటలకు ఎంవోఎక్స్/ఇస్ట్రాక్ లో ల్యాండింగ్ ఆపరేషన్ ల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 19వ తేదీన 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్పీడీసీ) తీసిన చంద్రుడి చిత్రాలు ఇవి. ఈ ఎల్పీడీసీ చిత్రాలు చిత్రాలు ల్యాండర్ మాడ్యూల్ ను ఆన్ బోర్డ్ మూన్ రిఫరెన్స్ మ్యాప్ తో సరిపోల్చడం ద్వారా దాని స్థానాన్ని (అక్షాంశం, రేఖాంశం) నిర్ణయించడంలో సహాయపడతాయి’’అని ఇస్రో అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు పెట్టింది. 

Scroll to load tweet…

చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'సాఫ్ట్ ల్యాండింగ్' సాధించే ఉద్దేశంతో 2019లో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ తో టూ వే కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసింది. చంద్రుడి చుట్టూ కక్ష్యను 25×134 కిలోమీటర్లకు కుదించేందుకు చంద్రయాన్-3 ల్యాండర్ తుది దశ ఆదివారం పూర్తయింది. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి ఆకస్మిక పరిస్థితులు ఎదురుకాలేదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

Scroll to load tweet…

కాగా.. ల్యాండర్ స్థానం దిగడానికి అనుకూలంగా లేదని అంతరిక్ష సంస్థ కనుగొంటే చంద్రుడిపై చంద్రయాన్ -3 ల్యాండింగ్ ఆగస్టు 27కు వాయిదా పడే అవకాశం ఉందని అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ -ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ సోమవారం తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్-3 ల్యాండింగ్ జరగడానికి రెండు గంటల ముందు ల్యాండింగ్ చేయడం సముచితమా కాదా అనే అంశంపై స్పేస్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.