Chandrayaan -3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి చోటు చేసుకుంది. అంతరిక్ష నౌక భూ కక్ష్యను విడిచి చంద్ర కక్ష్య (ట్రాన్స్‌లూనార్) లోకి ప్రవేశించింది. 

Chandrayaan -3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతంగా ఒక్కో దశ దాటుకుంటూ ముందుకు సాగుతోంది. చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను చేధించే లక్ష్యంతో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 నౌక ఇవాళ మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఐదు దశల్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3 నౌక నేడు (మంగళవారం) కీలకమైన ఆరో దశలో అడుగుపెట్టింది.

ఈ దశలో చంద్రయాన్ 3 నౌక భూమి కక్షను విడిచి.. చంద్రుడి కక్షలోకి ప్రవేశించబోతోంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-3 అంతరిక్ష నౌక నేడు (మంగళవారం) ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసి, చంద్రుని వైపు వెళుతోందని జాతీయ అంతరిక్ష సంస్థ తెలిపింది. 

ISTRAC (ISRO టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్) వద్ద విజయవంతంగా పెరిజీ-ఫైరింగ్ ప్రదర్శించబడింది. ఇస్రో అంతరిక్ష నౌకను ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు తెలిపింది. తదుపరి స్టాప్ చంద్రుడేననీ, దీంతో ఐదు రోజుల్లో (ఆగష్టు 5, 2023 నాటికి) చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యకు చేరుకోనుందని ఇస్రో తెలిపింది. ఈ ఆపరేషన్‌తో.. 2145 కిలోల థ్రస్టర్, విక్రమ్ (ల్యాండర్), ప్రజ్ఞాన్ (రోవర్)లతో కూడిన చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ చంద్ర కక్ష్య వైపు సరళ మార్గంలో ప్రయాణిస్తుంది. చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ఇంతకు ముందు ఐదుసార్లు భూమి కక్ష్యలో తిరిగింది. 

చంద్రయాన్-3 ప్రత్యేకత ఏంటో తెలుసా?

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం( ఇస్రో) చంద్రయాన్ 3 జూలై 14న ప్రయోగించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ గతంలో అన్వేషించని చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద అంతరిక్ష నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 3వ సారి విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా, చైనా, రష్యా అనే మూడు దేశాలు మాత్రమే ఇప్పటివరకు చంద్రుని ఉపరితలంపైకి సురక్షితంగా వెళ్లాగలిగాయి. చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసి..చంద్రునిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ అవతరించాలని భావిస్తుంది.

Scroll to load tweet…