వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు పిలుపునిచ్చిన చక్కా జామ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రహదారులను దిగ్బంధిస్తున్నారు రైతులు. మధ్యాహ్నం 3 గంటల వరకు చక్కా జామ్ కొనసాగుతోంది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు పిలుపునిచ్చిన చక్కా జామ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రహదారులను దిగ్బంధిస్తున్నారు రైతులు.
మధ్యాహ్నం 3 గంటల వరకు చక్కా జామ్ కొనసాగుతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలు శత్రు దుర్బేధ్యంగా మారాయి. బారికేడ్లు, ముళ్ల కంచెలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఢిల్లీలోని 12 మెట్రో రైల్వే స్టేషన్‌ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర నిరంతర నిఘా పెట్టారు. మండీ హౌస్, ఐటీవో, ఢిల్లీ గేట్, లాల్ కిల్లా, జామా మసీద్ మెట్రో స్టేషన్‌లను పోలీసులు మూసివేశారు.
హర్యానా రహదారులు సైతం ఆందోళన కారులతో నిండిపోయాయి. చక్కా జామ్‌కు సంబంధించి వేలాదిగా తరలివచ్చిన రైతులు రహదారులను దిగ్బంధించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు చక్కా జామ్ సందర్భంగా తిరువనంత పురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దేశంలో ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాల్లో చక్కా జామ్ జరుగుతోంది.
