Asianet News TeluguAsianet News Telugu

సర్వైకల్ క్యాన్సర్ : కారణాలు, లక్షణాలు, చికిత్స... మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలివే...

ఆర్థిక మంత్రి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ప్రస్తావించడం, నటి, మోడల్ పూనమ్ పాండే ఈ వ్యాధితో మృతి చెందడం.. ఈ క్రమంలో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ముందుగా గుర్తిస్తే ఎలా బయటపడొచ్చు? చూడండి.. 

Cervical Cancer : Causes, Symptoms, Treatment, What Women Should Know - bsb
Author
First Published Feb 2, 2024, 2:05 PM IST

న్యూ ఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం, మహిళల్లో గర్భాశయ ముఖద్వారం లేదా యోని నుండి గర్భాశయంలోకి ప్రవేశించే మార్గంలో.. కణాల అసాధారణ పెరుగుదల వల్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఏర్పడుతుంది. అత్యంత సాధారణంగా వచ్చే నాలుగు క్యాన్సర్ లలో ఇదీ ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా 604,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని 2020లో అంచనా వేయబడింది. వీరిలో దాదాపు 342,000 మంది ఈ వ్యాధితో మరణించారు. ఇది సాధారణంగా వచ్చే క్యాన్సరే అయినప్పటికీ.. దీనిని ముందుగా గుర్తిస్తే.. చికిత్సతో తగ్గించవచ్చు. చికిత్సతో నయం చేయగల క్యాన్సర్ లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. దీనిని మొదటి స్టేజ్ లోనే గుర్తించవచ్చు.

2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో, 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకాలు వేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ప్రముఖ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి...

యునివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP)లో యుక్తవయస్సులో ఉన్న బాలికలకు జంట మోతాదు నియమావళిగా ప్రవేశపెట్టడానికి భారతదేశంలో తయారు చేసిన క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్‌ను పరిగణించవచ్చని గత సంవత్సరం కేంద్రం తెలిపింది.

ఇది ఎలా కలుగుతుంది?
హ్యూమన్ పాపిల్లోమావైరస్ లేదా HPV 99% గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణం. ఇది గొంతు, జననేంద్రియాలు, చర్మాన్ని ప్రభావితం చేసే సాధారణ లైంగిక సంక్రమణం. దాదాపు అన్ని లైంగికంగా చురుకైన వ్యక్తులు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ వ్యాధి బారిన పడతారని డబ్ల్యూ హెచ్ఓ తెలిపింది. అయితే, సాధారణంగా లక్షణాలు కూడా కనిపించకుండా దీని బారిన పడతారని చెప్పింది.

చాలా సందర్భాలలో, రోగనిరోధక వ్యవస్థ ద్వారా వైరస్ శరీరం నుండి క్లియర్ చేయబడుతుంది. అయినప్పటికీ, నిరంతర సంక్రమణ అసాధారణ కణాల పెరుగుదలకు దారితీస్తుంది. ఆ తరువాత ఇది క్యాన్సర్‌గా మారుతుంది. అసాధారణ కణాలు క్యాన్సర్‌గా మారడానికి 15-20 సంవత్సరాలు పడుతుంది, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన మహిళల్లో ఈ ప్రక్రియకు 5-10 సంవత్సరాలు మాత్రమే పడుతుంది.

చిన్న వయసులో తల్లులైన వారు, హార్మోన్ల గర్భనిరోధక వినియోగదారులు, ధూమపానం చేసేవారు,  లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధులు గర్భాశయ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయి.

లక్షణాలు, చికిత్స
WHO ప్రకారం, గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఇలా ఉన్నాయి.. 

పీరియడ్స్ లేని సమయంలో, మెనోపాజ్ తర్వాత లేదా లైంగిక సంపర్కం తర్వాత విపరీతంగా రక్తస్రావం అవ్వడం..
దుర్వాసనతో కూడిన యోని స్రవాలు 
వెన్ను, కాళ్లు లేదా పొత్తికడుపులో నిరంతర నొప్పి వంటి లక్షణాలు
బరువు తగ్గడం, అలసట, ఆకలి లేకపోవడం
యోనిలో అసౌకర్యం
కాళ్ళలో వాపు
గర్భాశయ క్యాన్సర్ ఉందా? లేదా? నిర్థారించాలంటే.. డాక్టర్ల సూచనతో, గుర్తింపు పొందిన డయాగ్నస్టిక్ టెస్ట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని నయం చేయడానికి శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీలతో పాటు.. నొప్పి నిర్వహణకు సెకండరీ కేర్ లు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios