Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్‌ సంక్షోభం: పరిశ్రమలకు కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో కరోనా సంక్షోభం నెలకొంది. హాస్పటళ్లకు ఆక్సిజన్ అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే జర్మనీ, సింగపూర్‌ల నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పిస్తోంది

Centres fresh guidelines for states ahead of Phase 3 ksp
Author
New Delhi, First Published Apr 25, 2021, 8:12 PM IST

దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో కరోనా సంక్షోభం నెలకొంది. హాస్పటళ్లకు ఆక్సిజన్ అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే జర్మనీ, సింగపూర్‌ల నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పిస్తోంది.

అలాగే మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లకు అనుమతినిచ్చింది. తాజాగా ఆక్సిజన్‌పై కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ మొత్తం ఆసుపత్రులకే వాడాలని సూచించింది. ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ అంతా ఆసుపత్రులకే ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. పరిశ్రమలు తమ ఉత్పత్తులను తగ్గించుకోవాలని కోరింది.

Also Read:మే 2 తర్వాత చివరి అస్త్రం, లాక్ డౌన్ అవకాశం, మోడీ మదిలో ఏముంది..?

మరోవైపు ఆక్సిజన్‌ను దిగుమతి చేసేందుకు భారత్‌ ప్రభుత్వం సింగపూర్‌తోనూ సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించడంతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఖాళీ యుద్ధవిమానాలు అక్కడికి బయల్దేరి వెళ్లాయి.

అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌ఫోర్సు సేవలను కూడా వినియోగించుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. అంతేకాకుండా దేశంలో ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు రక్షణ శాఖ కూడా చర్యలు మొదలు పెట్టింది. జర్మనీ నుంచి 23 మొబైల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో వారం రోజుల్లో అవి కూడా అందుబాటులోకి రానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios