Asianet News TeluguAsianet News Telugu

ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. పిల్లలకు చికిత్స ఎలా, కేంద్రం మార్గదర్శకాలు

ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికే ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌‌లో థర్డ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో వృద్ధులు, రెండో విడతలో యువతపై కోవిడ్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థర్డ్ వేవ్‌లో పిల్లలపై వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుందని నిపుణులు అంటున్నారు.

Centres Covid Treatment Guidelines for Kids ksp
Author
New Delhi, First Published Jun 12, 2021, 8:50 PM IST

ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికే ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌‌లో థర్డ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో వృద్ధులు, రెండో విడతలో యువతపై కోవిడ్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థర్డ్ వేవ్‌లో పిల్లలపై వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుందని నిపుణులు అంటున్నారు.

దీంతో పిల్లలకు కరోనా సోకితే ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. పిల్లలకు రెమ్‌డెసివిర్ ఔషధం ఇవ్వరాదు. అంతేకాకుండా.. సీటీ స్కాన్ పరీక్ష విషయంలో కూడా వైద్యులు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అవసరమనుకున్న సందర్భాల్లో మాత్రమే వైద్యులు ఈ పరీక్ష చేయించాలని సూచించాలి. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు మాత్రమే స్టెరాయిడ్లు ఇవ్వాలని.. అవసరమైనుకుంటేనే యాంటీబయాటిక్‌లను పిల్లల కరోనా చికిత్సలో భాగం చేయాలని కేంద్రం సూచించింది.

Also Read:పిల్లలు, పెంపుడుజంతువులు ఒకే బెడ్ మీద పడుకుంటున్నారా?.. అది మంచిదేనట..

మరో బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఉందని వైద్యులు గుర్తిస్తేనే యాంటీబయాటిక్‌లు ఇవ్వాలని తెలిపింది. పిల్లల్లో వ్యాధి తీవ్రత మధ్యస్థంగా ఉన్నా లేక అసలు కరోనా లక్షణాలే లేకున్నా కార్టికో స్టెరాయిడ్లు వినియోగించాల్సి అవసరం లేదని వెల్లడించింది. వ్యాధి  ముదురుతునప్పుడు, అదీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే స్టెరాయిడ్లు వినియోగించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios