Asaduddin Owaisi: జ‌మ్మూక‌శ్మీర్‌లో వ‌రుస‌గా జ‌రుగుతోన్న ఉగ్ర‌దాడుల‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 1989 నాటి తప్పిదాలను పునరావృతం చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని ఏఐఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ విమ‌ర్శించారు.  

Asaduddin Owaisi: జ‌మ్మూక‌శ్మీర్‌లో వ‌రుస‌గా జ‌రుగుతోన్న ఉగ్ర‌దాడుల‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) త‌నదైన లో స్పందించారు.కేంద్ర ప్ర‌భుత్వ విధానాల ఫలితంగానే ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. మోడీ ప్ర‌భుత్వం చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవ‌డం లేద‌ని, 1989 నాటి త‌ప్పులే మ‌ళ్లీ చేస్తే.. ప‌రిస్థితి చేజారుతుంద‌ని హెచ్చ‌రించారు. 1989లో కూడా రాజకీయ కేంద్రాలను మూసివేశారని, కాశ్మీర్ లోయలోని రాజకీయ నాయకులను మాట్లాడనివ్వడం లేదని అన్నారు. క‌శ్మీరీ పండిట్ల‌ను బీజేపీ ఏనాడూ మ‌నుషులుగా చూడ‌లేద‌ని, వారిని కేవ‌లం ఓటుబ్యాంక్‌గానే బీజేపీ చూసింద‌ని Asaduddin Owaisi మండిప‌డ్డారు.

1987లో జ‌రిగిన‌ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో నెల‌కొన్న‌ ఉద్రిక్తత, అసంతృప్తి కారణంగా.. కాశ్మీర్ లోయలో 1989, సెప్టెంబర్ లో వ‌రుస‌గా ఉగ్ర‌దాడులు, హత్యలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో భారతదేశంలో అత్యంత రిగ్గింగ్ జ‌రిగింద‌ని Asaduddin Owaisi ఆరోపించారు. 

ఉగ్ర‌వాద దాడుల‌కు బాధ్య‌త వ‌హించాల్సింది మోదీ స‌ర్కారేన‌ని, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను తాను ఖండిస్తున్న‌ట్లు ఓవైసీ తెలిపారు. కాగా, తాజాగా, జ‌మ్మూక‌శ్మీర్‌లో చోటు చేసుకున్న వరుస‌ ఉగ్ర‌వాద దాడులు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 1989-1990 మ‌ధ్య జ‌రిగిన దాడుల కార‌ణంగా.. క‌శ్మీర్ పండిట్లు పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు వెళ్లారు.

ఇటీవ‌ల కశ్మీర్ లోయలో జ‌రిగిన వ‌రుస‌ హత్యలు

దాదాపు గ‌త నెల రోజుల ప‌రిధిలోనే క‌శ్మీర్ లో కొన్ని వ‌ర్గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాద దాడులు జ‌రుగుతున్నాయి. గ‌త 26 రోజుల్లో వ‌రుస‌గా.. ఆరు హత్య‌లు జ‌రిగాయి.

> జూన్ 2న దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ బ్యాంక్ ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. విజ‌య్ కుమార్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ వాసి.

> మే 31, మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని గోపాల్‌పోరా ప్రాంతంలో ఒక హిందూ మహిళపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది.

> మే 25న బుద్గామ్‌లో బుల్లితెర నటి అమ్రీన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ స‌మ‌యంలో ఆమె 10 ఏళ్ల మేనల్లుడు చేతికి బుల్లెట్ గాయమైంది.

 > మే 24న శ్రీనగర్‌లో ఓ పోలీసుపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ వ్య‌క్తి అక్క‌డిక్క‌డే మరణించాడు.
ఈ ఘటనలో అతని ఏడేళ్ల కుమార్తె గాయపడింది.

> మే 17న బారాముల్లాలోని దీవాన్‌బాగ్‌లోని వైన్‌షాప్‌పై గుర్తుతెలియని ఉగ్రవాది గ్రెనేడ్ విసిరాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌ వ్యక్తి చనిపోయాడు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు.

> మే 12న జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ మరణించాడు.