Asianet News TeluguAsianet News Telugu

ఆ మూడు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం...

సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, అంతర్జాతీయ సరిహద్దులను కాపాడే రాష్ట్రాలలో బిఎస్‌ఎఫ్ తన అధికారాలను అమలు చేయడానికి జూలై 2014 కంటే ముందటి నోటిఫికేషన్ షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

Centre extends BSF jurisdiction in three border states to 50 km, cuts short in one
Author
Hyderabad, First Published Oct 14, 2021, 10:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ : బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు భద్రతా దళం  అధికారాల పరిధిని పెంచింది. ఈ మేరకు Border Security Force అధికారులకు అరెస్టు, సెర్చ్, స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చింది. ఈ అధికార పరిధి పశ్చిమ బెంగాల్, పంజాబ్, అసోం మూడు రాష్ట్రాలలో విస్తరించబడింది.

సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, అంతర్జాతీయ సరిహద్దులను కాపాడే రాష్ట్రాలలో బిఎస్‌ఎఫ్ తన అధికారాలను అమలు చేయడానికి జూలై 2014 కంటే ముందటి నోటిఫికేషన్ షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని భారతదేశం-పాకిస్తాన్, భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి  International Border నుండి భారత భూభాగం లోపల 50 కిలోమీటర్ల వరకు ప్రాంతీయ అధికార పరిధిని హోం మంత్రిత్వ శాఖ పెంచింది. ఇది కాకుండా, బిఎస్ఎఫ్ నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, లడఖ్‌లో కూడా సెర్చులు చేయడం, అరెస్టులు చేసే అధికారాలు కలిగి ఉంది. 

మరోవైపు, గుజరాత్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికార పరిధి తగ్గించబడింది. సరిహద్దు విస్తీర్ణంకూడా  80 కి.మీ నుండి 50 కిమీకి తగ్గించబడింది, రాజస్థాన్‌లో వ్యాసార్థం ప్రాంతం 50 కిమీగా మార్చబడింది.

ఐదు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్,  Jammu and Kashmir, లడఖ్‌కు సరిహద్దులు నిర్ణయించబడలేదు. ఇదిలా ఉంటే.. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ చర్యను 'ఫెడరలిజంపై ప్రత్యక్ష దాడి'గా పేర్కొంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.

"అంతర్జాతీయ సరిహద్దుల వెంట నడుస్తున్న 50 కిమీ బెల్ట్ పరిధిలో BSF కి అదనపు అధికారాలు ఇవ్వాలనే భారత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది సమాఖ్యవాదంపై ప్రత్యక్ష దాడి. ఈ అహేతుక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నాను "అని ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

CrPC, పాస్‌పోర్ట్ చట్టం మరియు పాస్‌పోర్ట్ (భారతదేశానికి ప్రవేశం) చట్టం కింద ఈ చర్య తీసుకునే హక్కు BSF కి ఇవ్వబడింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్, 1968 లోని సెక్షన్ 139 BSF  విస్తీర్ణం, పరిధిని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి కేంద్రానికి అధికారం ఇస్తుంది.

‘పీఎం గతిశక్తి’ ప్రాజెక్టు ప్రారంభించిన ప్రధాని.. 21వ శతాబ్ది భారతావని నిర్మాణానికి దోహదం

కాగా, జమ్ము కశ్మీర్‌లో నిత్యం encounterలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మరణిస్తూనే ఉన్నారు. జమ్ము కశ్మీర్‌లో కొంత కాలంగా ఉగ్రబెడద సద్దుమణిగినట్టే అనిపించినా మళ్లీ పెరుగుతున్నది. కొన్నాళ్లుగా కాల్పులు, ఎదురుకాల్పులతో కశ్మీర్ లోయ దద్దరిల్లుతున్నది. తాజాగా బుధవారం దక్షిణ కశ్మీర్ జిల్లా pulwamaలో అవంతిపొరాలోని త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు, టాప్ terrorist షామ్ సోఫి హతమయ్యాడు. ఈ విషయాన్ని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్ వెల్లడించారు.

త్రాల్ ఏరియాలోని తిల్వాని మొహల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం అందగానే భద్రతా బలగాలు ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే jammu kashmirలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అక్కడ తలదాచుకున్న ఉగ్రవాది పోలీసులపైకి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులూ ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే టెర్రరిస్ట్ సోఫి హతమయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios