Lakhimpur Kheri: రైతు ఉద్యమం నేపథ్యంలో స్వయంగా ప్రధాని మోడీ.. పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పై ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుగు సాగడం లేదనీ, దీనికి కృషి చేయడం లేదని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆరోపించింది.
Lakhimpur Kheri: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఏడాదిన్నర కాలం ఉద్యమం చేశారు. దేశవ్యాప్తంగా రైతు మహా పంచాయత్ లు నిర్వహిస్తూ.. తమ గళాన్ని వినిపించారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. ఆ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు క్షమాపణలు చేప్పిన ప్రధాని మోడీ.. పండించిన పంటకు కనీస మద్దతు ధర ( minimum support price-MSP), ఇతర రైతు డిమాండ్లను నెరవేర్చడానికి హామీలు ఇచ్చారు. దీంతో రైతులు ఉద్యమం విరమించుకున్నారు.
అయితే, రైతు ఉద్యమం నేపథ్యంలో స్వయంగా ప్రధాని మోడీ.. పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పై ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుగు సాగడం లేదనీ, దీనికి కృషి చేయడం లేదని సంయుక్త్ కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha-SKM) (ఎస్‌కేఎం) ఆరోపించింది. లఖింపూర్ ఖేరీలో రైతు నాయకుడు శివకుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రైతుల నిరసనల నేపథ్యంలో పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) సమస్యపై ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. నిరసనకారులపై పెట్టిన అన్ని కేసులను వెనక్కి తీసుకుంటామనీ, ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక నష్టపరిహారం అందిస్తామని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు హామీలు ఇచ్చిందని బీకేయూ నేత రాకేష్ టికాయత్ అన్నారు. అలాగే రైతులను కరెంటు బిల్లుల పరిధిలోకి రాకుండా చూస్తామని తెలిపారు. అయితే, ఆయా వాగ్దానాలను నేరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాడగం లేదని రైతు నాయకులు విశకుమార్ శర్మ, రాకేష్ టికాయత్ (Rakesh Tikait) లు పేర్కొన్నారు.
"గడ్డి తగులబెట్టడంపై శిక్షలు విధించడం, జరిమానాలు విధించడం వంటి నిబంధనలను తొలగిండానికి హామీ ఇచ్చారు. ముఖ్యమైన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చారు. చట్టం తీసుకోస్తామని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. అయితే, దాని కోసం కనీసం కమిటీని కూడా ఏర్పాటు చేయలేదని" రైతు నాయకులు పేర్కొన్నారు. 2021 నవంబర్ 19న స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ అది ఇంకా అమలుకు నోచుకోలేదు అని రైతు నాయకుడు శివకుమార్ శర్మ(Shivkumar Sharma) పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ గత సెషన్‌లో పార్లమెంటులో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుండి అనుమతి కోరుతున్నట్లు ప్రకటించాడు. దీనిపై కూడా రైతు నాయకులు విమర్శలు గుప్పించారు. 'ప్రధాని ప్రకటన ఆధారంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఎన్నికల కమిషన్ ప్రభావం ఉండేది కాదు' అని పేర్కొన్నారు.
అదేవిధంగా, మొత్తం ఐదు అంశాలపై ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ వాటిలో ఒక్కటికూడా చర్యల్లో ముందుకు సాగలేదని గతంలోనే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జనవరి 31 న SKM దేశవ్యాప్తంగా 'ద్రోహ దినం' పాటించింది. ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎవరికీ ఓటు వేయమని తాము కోరమనీ, బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఓటు వేయమని తాము ఎవరినీ కోరమని తెలిపిన రైతు నాయకులు.. ఎవరికి ఓటు వేయాలోరైతులకు తెలుసునని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)ఘటన ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
