Asianet News TeluguAsianet News Telugu

Desh Ke Mentor Program: 'దేశ్ కే మెంటర్' పై రాజ‌కీయాలొద్దు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ !

Desh Ke Mentor Program: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'దేశ్ కే మెంటర్' కార్యక్రమాన్ని ఆపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మనీష్ సిసోడియా ఇదివ‌ర‌కు అన్నారు. దేశ మెంటర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి NCPCR లేఖపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. కేంద్రం తీరును త‌ప్పుబ‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో ఏదైనా మంచి పని జరుగుతుంటే, దాన్ని ఆపకుండా, దేశం మొత్తం అమలు చేయాలని అన్నారు. 
 

Central government should not do politics on the mentor of the country, Delhi CM Kejriwal said on the letter of NCPCR
Author
Hyderabad, First Published Jan 14, 2022, 5:49 PM IST

Desh Ke Mentor Program: లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే చ‌ర్య‌ల్లో భాగంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స‌ర్కారు  'దేశ్ కే మెంటర్' కార్యక్ర‌మాన్ని చేప‌ట్టింది. అయితే, ఈ కార్య‌క్ర‌మం బీజేపీ-ఆప్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌లేపింది. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'దేశ్ కే మెంటర్' కార్యక్రమాన్ని ఆపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మనీష్ సిసోడియా ఇదివ‌ర‌కు అన్నారు. దేశ మెంటర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి NCPCR లేఖపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. కేంద్రం తీరును త‌ప్పుబ‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో ఏదైనా మంచి పని జరుగుతుంటే, దాన్ని ఆపకుండా, దేశం మొత్తం అమలు చేయాలని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  ఇందులో రాజకీయాలు చేయొద్దని కోరారు.  

దేశ్ కే మెంటర్ ప్రోగ్రామ్ లో రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల  పేద పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంద‌ని  కేజ్రీవాల్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్య ప్రజా ఉద్యమంగా మారుతున్న‌ద‌ని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'దేశ్ కే మెంటార్' కార్యక్రమాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర పన్నింద‌ని ఆప్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో దేశంలోని 44 వేల మంది విద్యావంతులైన యువతకు, సమాజంలోని పేద వర్గాల నుండి వచ్చిన 1.76 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కెరీర్ గైడెన్స్, మెంటరింగ్ ఇస్తున్నామ‌ని పేర్కొంటున్నారు. 

అయితే, దేశ్ కే మెంటర్ ప్రోగ్రామ్ లో కొన్ని లోపాల‌ను చూపుతూ.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR).. వాటిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు దీనిని నిలిపివేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వానికి సూచించింది. ఈ కార్యక్రమం వల్ల పిల్లలు కొన్ని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని NCPCR చెబుతోంది. కమిషన్ గత సోమవారం చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ దేవ్‌కు ఒక లేఖ రాసింది.  'అందులో ఈ కార్యక్రమంలో మార్గదర్శకులు స్వలింగ సంపర్కులని ఎత్తి చూపారు. కాబట్టి, వేధింపులు లేదా లైంగిక వేధింపులు ఒకేలా ఉన్నాయా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. దాడులు లింగంపై ఆధారపడి ఉండవు. స్వలింగ వ్యక్తులు పిల్లల భద్రతను నిర్ధారించాల్సిన అవసరం లేదు. లోటుపాట్లను సరిదిద్దే వరకు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయండి' అని పేర్కొంది.  

అయితే, కావాల‌నే కేంద్రంలోని బీజేపీ ఈ కార్య‌క్ర‌మంపై రాజ‌కీయాలు చేస్తున్న‌ద‌ని ఆప్ ఆరోపిస్తున్న‌ది.  కాగా, దేశ్ కే మెంటర్ ప్రోగ్రామ్ ను గ‌తేడాది అక్టోబ‌ర్ లో ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ స‌ర్కారు ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 9 వ త‌ర‌గ‌తి నుంచి 12 త‌ర‌గ‌తి వ‌ర‌కు పిల్ల‌ల‌కు వారి కెరీర్‌, లైఫ్ కు సంబంధించి స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తూ.. మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేస్తారు. ఇది ఉచితంగా అందిస్తున్న సేవ‌. ఈ కార్య‌క్ర‌మంలో పిల్ల‌ల భ‌విష్యత్తును తీర్చిదిద్ద‌డంలో మెరుగైన పాత్ర పోషిస్తుంద‌ని ఆప్ పేర్కొంది. 

‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి ప్ర‌ముఖ భార‌తీయ న‌టుడు, క‌రోనా లాక్‌డౌన్ కాలంలో రియ‌ల్ హీరో అనుపించుకున్న సోనూసూద్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొన‌సాగుతున్నారు.  ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితులైన సంద‌ర్భంలో సోనూసూద్ మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే అవకాశం నాకు దక్కింద‌నీ, ఇంతకంటే గొప్పసేవ మరొకటి  లేద‌ని అన్నారు.  పిల్ల‌ల భ‌విష్య‌త్తును మెరుగ్గా చేసే ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో విద్య‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌నీ,  పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించాన‌ని వెల్ల‌డించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios