Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం ఆందోళ‌న అవినీతిపై కాదు.. అర‌వింద్ కేజ్రీవాల్ విష‌యంలో.. - మనీష్ సిసోడియా

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి విషయంలో భయపడటం లేదని, అరవింద్ కేజ్రీవాల్ ను చూసి భయపడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఢిల్లీ విద్యా విధానం ఎన్నో ప్రశంసలు అందుకుంటోందని తెలిపారు. 

Centers concern is not on corruption.. Arvind Kejriwal's case.. - Manish Sisodia
Author
First Published Aug 20, 2022, 2:18 PM IST

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇళ్లుతో పాటు 31 ప్రదేశాలలో శుక్ర‌వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు నిర్వహించింది. ఈ ప‌రిణామం చోటు చేసుకున్న ఒక రోజు త‌రువాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు సిసోడియా మీడియాతో మాట్లాడారు. సీబీఐ రైడ్ అవినీతి నిర్మూలించడం లక్ష్యంగా జరగలేదని అన్నారు. దీనిని కేజ్రీవాల్ ఎదుగుద‌లకు అడ్డుకునేందుకు జ‌రిగాయ‌ని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని అన్నారు.

ప్రియా వర్గీస్ నియామకంపై వివాదం: వర్సిటీ నియామకాల్లో బంధుప్రీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తాను.. కేరళ గవర్నర్

“ అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన చెందడం లేదు. అదే నిజమైతే, హూచ్ విషాదం తర్వాత గుజరాత్‌లో జరిగిన కుంభకోణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ విచారణ జరిపేవి. ప్రధాని ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ఐదు రోజులకే ఎందుకు కొట్టుకుపోయిందనే దానిపై విచారణ జరుపుతోంది. పంజాబ్‌లో ప్రజలు మార్పు కోరుకుంటున్నార‌ని నిరూపించిన అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్రం ఆందోళ‌న చెందుతోంది. ’’ అని సిసోడియా అన్నారు.

బీజేపీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందిన ఆయ‌న ఆరోపించారు. “ ఢిల్లీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల మోసం చేసిందని అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు చెప్పడం నేను విన్నాను. 144 కోట్ల మేర మోసం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా అన్నారు. అయితే సీబీఐ ఛార్జిషీట్ మొత్తం రూ. 1 కోటి అని చెపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బీజేపీ కేవలం సీబీఐ, ఈడీలను ఉపయోగిస్తోంది.’’ అని ఆయన తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లో పోటెత్తిన వరదలు.. ఆరుగురు దుర్మరణం.. మరో 13 మంది మిస్సింగ్!

ప్రతిపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను కూలదోయడానికి, కుట్రలు పన్నడానికి దేశ ప్రజలు ఆయనకు (ప్రధాని) ఓటు వేసి గెలిపించ‌లేద‌ని, దేశాన్ని ప‌రిపాలించ‌డానికి ఓటు వేశార‌ని సిసోడియా అన్నారు. “మహారాష్ట్ర, గోవాలో వారు ఏమి చేశారో అందరూ చూశారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగంలో అద్బుతమైన పని చేస్తుంటే ప్రధాని భ‌య‌ప‌డుతున్నారు. 2024లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేస్తారని ప్రజలు అడుగుతూనే ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అని నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను.’’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం అన్నారు.

జ‌మ్మూ కాశ్మీర్ లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి కూలిన ఇళ్లు.. ఇద్ద‌రు చిన్నారుల మృతి..

న్యూయార్క్ టైమ్స్‌లోని మొదటి పేజీలో భారత్ కు సంబంధించిన రెండు విషయాలు కథనాల రూపంలో వచ్చాయని మనీష్ సిసోడియా ప్రస్తావించారు. “ ఢిల్లీ విద్యా విధానం విజయం గురించి న్యూయార్క్ టైమ్స్ లో ఒక క‌థ‌నం వ‌చ్చింది. దేశంలో కోవిడ్ కేసుల అనియంత్రిత పెరుగుదలపై మ‌రో క‌థ‌నం వ‌చ్చింది. ఈ విష‌యం  బయటకు రాగానే దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు. దేశంలోని పాలనా స్థితిపై మాకు సంతోషం క‌ల‌గ‌లేదు. అయితే ఇప్పుడు ఢిల్లీ విద్యా న‌మూనా విజంయ మొద‌టి పేజీకి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తీ పౌరుడు సంతోష ప‌డ్డాడు. గ‌ర్వంగా ఫీల్ అయ్యాడు. ’’ అని ఆయన తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios