భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్ : అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో ‘ఒమిక్రాన్‌’ వేరియంట్ (omicron) చాప కింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 33 కేసులు వెలుగుచూడగా.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

center writes states and uts amid increasing of omicron cases in india

దేశంలో ‘ఒమిక్రాన్‌’ వేరియంట్ (omicron) చాప కింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 33 కేసులు వెలుగుచూడగా.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ (ministry of health and family welfare) కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ (rajesh bhushan) లేఖ రాశారు.  

దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొంది. కేరళ (kerala), మిజోరం (mizoram), సిక్కిం (sikkim) రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మిగిలిన 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.  

Omicron cases: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు.. మొత్తం కేసులు ఎంతకు చేరాయంటే..?

ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని సూచించింది. పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాలని... కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి, అవసరమైతే రాత్రి కర్ఫ్యూ (night curfew) విధించాలని తెలిపింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలి అని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది.

మరోవైపు భారత్‌లో శనివారం మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి ఒమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాను కూడా సందర్శించినట్టుగా పేర్కొంది. దీంతో ఢిల్లీలో (Delhi) ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కి చేరింది. తాజా కేసులతో కలుపుకుని.. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల (omicron cases in india) సంఖ్య 33కు పెరిగింది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. వాటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 17, గుజరాత్‌లో 3 , కర్ణాటకలో 2, రాజస్తాన్‌లో 9, ఢిల్లీలో 2 కేసులు ఉన్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios