Asianet News TeluguAsianet News Telugu

అలా అవకాశం లేదు.. ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై తేల్చేసిన కేంద్రం

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూ అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చేసిన భారతీయ విద్యా విద్యార్ధుల భవిష్యత్తుపై కేంద్రం స్పందించింది. భారత్‌కు వచ్చిన వైద్య విద్యార్ధులకు లోకల్ కాలేజీలలో అడ్మిషన్లపై ఎఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.

 center key announcement on ukraine returned medical students
Author
New Delhi, First Published Jul 23, 2022, 2:58 PM IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూ అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చేసిన భారతీయ విద్యా విద్యార్ధుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌కు వచ్చిన వైద్య విద్యార్ధులకు లోకల్ కాలేజీలలో అడ్మిషన్లపై ఎన్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

కాగా.. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ  ఆపరేషన్ ప్రారంభించి నెలలు గడుస్తోంది.దీంతో ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుకొనేందుకు వెళ్లిన భారత విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే చదువును మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఉక్రెయిన్ లో ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. దీంతో తమ చదువు, భవిష్యత్తుపై వైద్య విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.  ఇండియాలోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో  పిటిషన్ సైతం దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని  సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో వైద్య విద్యార్ధులు కోరారు.

అయితే ఇప్పటికే ఉక్రెయిన్ నుండి  తెలంగాణ నుండి వచ్చిన విద్యార్ధులను చదువు కోసం అయ్యే ఖర్చును భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు సీఎం కేసీఆర్త. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య విద్యార్ధుల చదువు విషయంలో సానుకూలంగా స్పందించింది.

Follow Us:
Download App:
  • android
  • ios