గోధుమ, ఆవాల పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గోధుమకు ఎంఎస్పీని రూ.110, ఆవాల పంటకు ఎంసీస్పీని రూ.400కు పెంచింది. 

రైతుల ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం గోధుమ, ఆవాల పంటకు మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధరలు) పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.

జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే.. శశికళపై బాంబు పేల్చిన ఆరుముగసామి కమిషన్‌ రిపోర్ట్

ఇందులో గోదుమాలకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.110 పెంచారు. దీంతో ఆ పంట ఎంఎస్పీ రూ.2,125కి చేరుకుంది. ఆవాలు క్వింటాల్‌కు రూ.400 పెంచింది. దీంతో ఆవాల కనీస మద్దతు ధర రూ.5,450కి చేరింది. 

ఫోన్ దొంగతనం చేశాడని.. పన్నెండేళ్ల చిన్నారిపై పైశాచితక్వం.. బావిలో వేలాడదీసి క్రూరత్వం...

ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించే 23 పంటలకు ప్రభుత్వం ఎంఎస్పీలను నిర్ణయిస్తుంది. ఖరీఫ్ (వేసవి) పంటలు పండిన వెంటనే అక్టోబర్‌లో రబీ (శీతాకాలపు) పంటల విత్తడం ప్రారంభమవుతుంది. గోధుమ, ఆవాలు ప్రధాన రబీ పంటలుగా ఉంటాయి. 

Scroll to load tweet…

అధికారిక లెక్కల ప్రకారం.. 2022-23 పంట సంవత్సరం (జూలై-జూన్), 2023-24 మార్కెటింగ్ సీజన్‌లో ఆరు రబీ పంటలకు ఎంఎస్పీల పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. 2021-22 పంట సంవత్సరంలో గోధుమ క్వింటాల్‌కు రూ. 2,015 ఎంఎస్పీ ఉండగా అది ఈ సంవత్సరం క్వింటాల్‌కు రూ. 110 పెంచడంతో రూ.2,125కి చేరుకుంది. కాగా.. గోధుమ ఉత్పత్తి వ్యయం క్వింటాల్‌కు రూ.1,065గా అంచనా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.