ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న AFSPA ను నాగాలాండ్ లో మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం రద్దు కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక అందించేలోపే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

నాగాలాండ్‌లో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం 1958 (AFSPA)ని మ‌రో ఆరు నెల‌ల పాటు పొడగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తింది. ఇది స‌రైన నిర్ణ‌యం కాద‌ని తెలిపింది. ఈ నిర్ణ‌యం ఈశాన్య రాష్ట్రాల‌ను ఆగాథంలోకి నెట్ట‌డ‌మే అవుతుంద‌ని పేర్కొంది.

పాలనపై మోదీకి మంచి పట్టు ఉంది.. అది సాధ్యం కాదని మోదీకే నేరుగా చెప్పాను: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

కమిటీ నివేదిక ఇవ్వకముందే..

డిసెంబర్ 4వ తేదీన నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ విలేజ్ సమీపంలో కాల్పుల ఘటనలో 14 మంది పౌరులు, ఒక జ‌వాన్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత సాయుధ ద‌ళాల‌కు ఇచ్చిన ప్ర‌త్యేక అధికారల చ‌ట్టాన్ని (AFSPA) విర‌మించుకోవాల‌ని ఈశాన్య రాష్ట్రాలు ఆందోళల‌ను చేస్తున్నాయి. ఈ ఆందోళ‌నల‌ను తీవ్ర రూపం దాల్చ‌డంతో నాగాలాండ్ సీఎం స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నాగాలాండ్ సీఎం నైఫియు రియో, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మలు భేటి నిర్వ‌హించారు. అనంత‌రం నాగాలాండ్ నుండి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్, 1958 (AFSPA)ని ఉపసంహరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెల‌ల్లోగా నివేదిక అందించాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఈ AFSPAను మ‌రో ఆరు నెల‌ల పాటు పొడ‌గిస్తూ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. "నాగాలాండ్ రాష్ట్రం మొత్తం ప్ర‌స్తుతం ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర పౌరుల‌కు స‌హాయంగా సాయుధ బలగాలను ఉంచ‌డం అవసరం" అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. న‌రేంద్ర మోడీ ఆధ్వ‌ర్యంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఈశాన్య రాష్ట్రాల‌ను అధర్మం, తిరుగుబాటు, గందరగోళం, అగాధంలోకి నెట్టడ‌మే అవుతుంద‌ని ఆరోపించింది. "ప్రజల నైతికత, దాని వైవిధ్యం, అక్క‌డి ఆందోళనలపై పూర్తి అవగాహన లేకపోవడం, అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించే ప్ర‌య‌త్నమే మమ్మల్ని ప్రస్తుత స్థితికి నడిపించింది" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.

భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటి కంటే 43 శాతం అధికం.. 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

AFSPA అంటే ఏమిటి ?
సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)- 1958 ద్వారా ఈశాన్య రాష్ట్రాల‌పైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలో రాష్ట్రాల్లో సాయుధ దళాల సభ్యుల‌కు కొన్ని ప్ర‌త్యేక అధికారాలు క‌ల్పించింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లో మోహరించిన బలగాలకు కూడా అధికారాలు వ‌చ్చాయి. ఈ చ‌ట్ట ప్ర‌కారం సున్నిత‌మైన ప్రాంతాల్లో, స‌మ‌స్యాత్మ‌క‌మైన ప్రాంతాల్లో ఎవ‌రైనా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సమావేశమైనప్పుడు, ఏదైనా కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ప్పుడు సాయుధ ద‌ళాలు కాల్పులు జ‌ర‌ప‌వ‌చ్చు. ఆ ప్రాంతాల్లో ఉన్న వ్య‌క్తుల వ‌ద్ద ఆయుధాలు ఉంటే కూడా కాల్పులు నిర్వ‌హించ‌వ‌చ్చు. దేశ భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం అనిపించ‌న‌ప్పుడు ఇలా కాల్పులు జ‌ర‌ప‌వ‌చ్చు. ఇలా ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌డానికి, కాల్పులు జ‌ర‌ప‌డానికి ఎలాంటి అనుమ‌తులు అవ‌స‌రం లేదు.