కరోనా కారణంగా మూసివేసిన జవహర్‌ నవోదయా విద్యాలయాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 31వ తేదీ నుంచి జవహర్‌ నవోదయా విద్యాలయాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 

కరోనా కారణంగా మూసివేసిన జవహర్‌ నవోదయా విద్యాలయాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 31వ తేదీ నుంచి జవహర్‌ నవోదయా విద్యాలయాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో తరగుతులు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాలు సైతం స్కూళ్లను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.