పుల్వామా ఘటన తర్వాత మౌనం పాటించిన పాక్ సేనలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత సైన్యం టార్గెట్‌గా కాల్పులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని సుందర్భానీ, తంగేధర్-కేరాన్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.

ఈ కాల్పులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో ఓ భారత జవాను మరణించగా.. ఇద్దరు పాక్ రేంజర్లను భారత సైన్యం మట్టుబెట్టినట్లుగా సమాచారం.