Asianet News TeluguAsianet News Telugu

Pawan Kalyan: విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు.. జ‌న‌సేనాని 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'

Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు  వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కార్మికులు చేస్తున్ననిర‌స‌న‌లు 300 రోజుల‌ను దాటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ ఉద్య‌మాన్ని ఉధృతంగా కొనసాగుతోంది. దనికి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన సైతం మ‌ద్ద‌తు తెలిపింది. ఆదివారం నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్  'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష' కు దిగ‌నున్నారు. 
 

Pawan Kalyan to stage Deeksha today against Vizag Steel Plant privatisation
Author
Hyderabad, First Published Dec 12, 2021, 9:02 AM IST

Pawan Kalyan:  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ళ్లీ ఉద్య‌మం ఉపందుకుంటున్న‌ది. Visakha Steel Plant ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ కార్మికులు, ప్ర‌జ‌లు చేస్తున్న నిర‌స‌న‌లు ఇటీవ‌లే 300 రోజులు దాటాయి. ఈ నేప‌థ్యంలోనే Visakha Steel Plant కార్మికుల‌కు జనసేన మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష‌ల‌కు సైతం దిగ‌నున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్ని పూర్త‌య్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష' కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఈ దీక్ష‌లో పార్టీ ప్ర‌ధాన శ్రేణులు సైతం పాలుపంచుకోనున్నాయి. 

Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో పవన్ ఎలాంటి లేఖ రాయ‌లేదు !

Visakha Steel Plant ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ.. ఆదివారం నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్ట‌నున్న  'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష'  మంగ‌ళ‌గిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంట‌ల  నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్ర‌యివేటీకరణను నిరసిస్తూ.. ఉద్య‌మం చేస్తున్న కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ  పవన్ కల్యాణ్  ఈ సంఘీభావ దీక్ష చేయనున్నారు. దీనిపై పార్టీ అధికారిక వ‌ర్గాలు మాట్లాడుతూ.. Visakha Steel Plant ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకంగా  విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష ఆదివారం ఉద‌యం 10 గంగ‌ల నుంచి  సాయంత్రం 5గంటల వరకు ఒక రోజు దీక్ష కొనసాగనుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ  ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు.. అఖిలపక్షాన్ని దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి తీసుకెళ్లాలని విశాఖ సభలో పవన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు వెల్ల‌డించాయి. 

Also Read: Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

ఇదిలావుండ‌గా, Visakhapatnam Steel Plant (VSP) ప్ర‌యివేటీక‌ర‌ణ ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనిని వ్య‌తిరేకిస్తూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ కార్మికులు చేస్తున్న నిర‌స‌న‌లు 300 రోజుల‌ను దాటాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ నిర‌స‌న‌ల‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉధృతం చేయ‌డానికి కార్మిక‌లు సిద్ధ‌మ‌య్యారు. వీరికి అండ‌గా, రాజ‌కీయ పార్టీలు, ఇత‌ర కార్మిక సంఘాలు, ప్ర‌జా సంఘాలు ముందుకు వ‌స్తున్నాయి. Visakhapatnam Steel Plant ప్ర‌యివేటీక‌రిస్తే.. ఉద్య‌మం మ‌హోగ్ర‌రూపం దాలుస్తుంద‌నీ, వెంట‌నే ఈ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాల‌ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఉద్య‌మంలో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి రావాల‌ని కోరుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌కు దిగుతున్నారు. ఇదిలావుండ‌గా, కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టింది. విశాఖ ఉక్కువిషయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ఎలాంటి లేఖ‌లు రాయ‌లేద‌ని వెల్ల‌డించింది. ఈ అంశం పార్టీని ఇర‌కాటంలోకి దించే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతున్నాయి. ప‌వ‌న్ దీక్ష‌.. లేఖ‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ లుగా ఉన్నాయి. 

Also Read: up assembly elections 2022: విద్యార్థుల‌కు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌లు !

Follow Us:
Download App:
  • android
  • ios