కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది.

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది.ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.దీంతో ఇవాళ సమీక్ష సమావేశంలో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకొన్నారు. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

also read:సీబీఎస్ఈ పరీక్షలు: ఉన్నతాధికారులతో మోడీ కీలక సమీక్ష

Scroll to load tweet…

10వ తరగతి విద్యార్ధులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఈ మార్కులతో విద్యార్ధులు సంతృప్తి చెందకపోతే పరీక్షలు రాయవచ్చని కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని తెలిపారుఈ ఏడాది మే 4వ తేదీ నుంండి జూన్ 14 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. కరోనా కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఇదే తేదీల్లో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది.ఈ ఏడాది జూన్ 1వ తేదీన సమీక్ష నిర్వహించిన తర్వాత తదుపరి పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు.