Asianet News TeluguAsianet News Telugu

సీబీఎస్ఈ పరీక్షలు: ఉన్నతాధికారులతో మోడీ కీలక సమీక్ష

సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

Modi holds meeting authorities on CBSE board Exams lns
Author
New Delhi, First Published Apr 14, 2021, 12:29 PM IST

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.దేశంలో కరోనా సేకండ్ వేవ్  విజృంభిస్తున్న తరుణంలో  సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.  పరీక్షలు నిర్వహించడం వల్ల  విద్యార్ధులు, టీచర్లకు పెద్ద ఎత్తున కరోనా సోకే అవకాశం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.పరీక్షలను రద్దు చేయాలని కోరారు. లేదా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే విషయమై అధికారులతో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షిస్తున్నారు. కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు  ఈ సమావేశానికి హాజరయ్యారు.గత ఏడాది కొన్ని రాష్ట్రాలు టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.  విద్యార్ధులకు వచ్చిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేశారు.  గత ఏడాదితో పోలిస్తే ప్రస్తతం కరోనా కేసులు  వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో  పరీక్షల నిర్వహణ  సాధ్యమా, పరీక్షలు నిర్వహించకుండా గత ఏడాది మాదిరిగా ప్రమోట్ చేయాలా  ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై  కేంద్రం యోచిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios