Asianet News TeluguAsianet News Telugu

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల విడుదల: బాలికలదే పైచేయి

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఈ ఫలితాలను సీబీఎస్ఈ ప్రకటించింది.  పరీక్షా ఫలితాల కోసం cbseresults.nic.in, cbse.gov.in సైట్లను వీక్షించాలని సీబీఎస్ఈ  ప్రకటించింది.

CBSE 12th Result 2021 Declared : 99.37% students clear Class 12 exam
Author
New Delhi, First Published Jul 30, 2021, 2:33 PM IST


న్యూఢిల్లీ: సీబీఎస్ఈ  12వ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం నాడు మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షా ఫలితాల కోసం cbseresults.nic.in, cbse.gov.in సైట్లను వీక్షించాలని సీబీఎస్ఈ  ప్రకటించింది.సీబీఎస్ఈ పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులంతా ఉత్తీర్థులైనట్టుగా  బోర్డు ప్రకటించింది. పరీక్షకు 13,04,561 మంది రిజిస్టర్  చేసుకొన్నారు. 12,96,318 మంది ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్ఈ తెలిపింది.

 

 

also read:నేడే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు: మార్కుల కేటాయింపు ఇలా...

99.67 శాతం మంది బాలికలు, 99.13 శాతం మంది బాలురు, 100 శాతం ట్రాన్స్ జెండర్లు ఉత్తీర్ణులయ్యారని బోర్డు ప్రకటించింది. బాలుర కంటే బాలికలే అధికంగా ఉత్తీర్ణత సాధించారు.సీబీఎస్ఈ  12వ తరగతిలో 129 మంది సీడబ్ల్యుఎస్ఎన్  విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించారు. 400 మందికి 90 శాతం మార్కులు దక్కాయని బోర్డు తెలిపింది.సీటీఎస్ఏ స్కూల్స్ , కేంద్రీయ విద్యాలయాల్లో  100శాతం ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించింది బోర్డు.

Follow Us:
Download App:
  • android
  • ios