Asianet News TeluguAsianet News Telugu

నేడే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు: మార్కుల కేటాయింపు ఇలా...

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం  రెండు గంటలకు విడుదల చేయనున్నారు.కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలను రద్దు చేశారు. టెన్త్, ఇంటర్ మార్కుల ఆధారంగా 12వ తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నారు.

CBSE Class 12 Results Today At 2 PM lns
Author
New Delhi, First Published Jul 30, 2021, 12:42 PM IST

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను cbseresults.nic.in,digilocker.gov.in సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.  పాస్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిపికెట్లు డిజిలాకర్ లో అందుబాటులో ఉంటాయని సీబీఎస్ఈ తెలిపింది. టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, 11వ తరగతిలో వచ్చిన మార్కులకు 30 శాతం, 12వ తరగతిలో 40 శాతం వెయిటేజీని అందిస్తారు.

ఈ మార్కులతో  సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డును సంప్రదించవచ్చు. గత ఏడాదిలో 12 వ తరగతిలో 88.78 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.కరోనా కారణంగా ఈ ఏడాది టెన్త్, 12వ తరగతి వార్షిక పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. ఈ నెలాఖరులోపుగా పరీక్ష ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు సీబీఎస్ఈని ఆదేశించింది. దీంతో ఇవాళ పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది సీబీఎస్ఈ.కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో కూడ టెన్త్, 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో మార్కులను కేటాయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios