దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది. ఫెరా నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపైనే ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం 40 చోట్ల  సీబీఐ సోదాలు నిర్వహించినట్లుగా సమాచారం.  

బుధవారం దేశవ్యాప్తంగా వున్న పలు స్వచ్ఛంద సంస్థలపై (non profit organisations) సీబీఐ దాడులు (cbi raids) నిర్వహించింది. దాదాపు 40 చోట్ల ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. విదేశీ నిధులతో (foreign funds) నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో సోదాలు జరిపింది. ఈ సందర్భంగా 14 మంది ఎన్జీవోలతో పాటు ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. స్వచ్ఛంద సంస్థల ముసుగులో భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. అలాగే ఈ దాడుల్లో రూ. 3 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌ను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఫెరా నిబంధనలు (fera rules) ఉల్లంఘించి.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు హవాలా ద్వారా ఆపరేటింగ్ చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.