Asianet News TeluguAsianet News Telugu

బోఫోర్స్‌కేసు: సుప్రీంలో కాంగ్రెస్‌కు ఊరట

బోఫోర్స్ కేసులో  కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 

CBI plea in Bofors case dismissed by Supreme Court in relief for Congress
Author
New Delhi, First Published Nov 2, 2018, 12:36 PM IST


న్యూఢిల్లీ: బోఫోర్స్ కేసులో  కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానంలో  సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌‌ను తిరస్కరించింది.

భారత సైనికుల కోసం ఆయుధాల కోనుగోలు  విషయంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని అప్పట్లో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశాయి. ఈ కేసు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టింది.  ఈ విషయంలో  కాంగ్రెస్‌ను విపక్షాలు విమర్శలతో దుమ్మెత్తిపోశాయి.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ స్నేహితుడు ఖత్రోచీ ఈ ఆయుధాల డీల్ లో  మధ్యవర్తిగా  వ్యవహరించాడని  ఆరోపణలు వచ్చాయి.  ఈ విషయమై 2005లో  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఢిల్లీ హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది.ఈ కేసులో హిందూజ సోదరులకు కూడ క్లీన్‌చిట్ ఇచ్చింది.దీంతో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ  సవాల్ చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం నాడు సీబీఐ కొట్టేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios