ఉద్యోగాల భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు.. లాలూ యాదవ్‌తో పాటు సంబంధిత అధికారులపై ప్రాసిక్యూషన్‌ చేయడానికి  సీబీఐకి కోర్టు ఆగస్టు 8 వరకు గడువు ఇచ్చింది. ఇందులో లాలూతోపాటు ఆయన కుమారుడు తేజస్వి, భార్య రబ్రీ పేర్లు కూడా ఉన్నాయి. 

ఉద్యోగాల భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, అతని కుటుంబానికి చిక్కులు తప్పడం లేదు. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌తో పాటు మరికొందరు రైల్వే అధికారులను విచారించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఆగస్టు 8 వరకు విచారించవచ్చని గడువు ఇచ్చింది. సీబీఐ చేసిన అభ్యర్థన మేరకు ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ కేంద్ర దర్యాప్తు సంస్థకు గడువు ఇచ్చారు.ఈ కుంభకోణంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్,ఆయన భార్య రబ్రీ దేవి, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లపై సీబీఐ జూలై 3న చార్జ్ షీట్ దాఖలు చేయబడ్డాయి. 

ఈ కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా లాలూ కుటుంబ సభ్యులందరి పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను మే నెలలో సీబీఐ కోరింది. 2004 నుండి 2009 వరకు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్‌తో సహా మొత్తం ఏడుగురు కుమార్తెలు, అల్లుడి పేర్లపై కొనుగోలు చేసిన, బహుమతిగా లేదా లీజుకు ఇచ్చిన స్థిరాస్తి వివరాలను కోరింది. మంత్రులు తేజ్ ప్రతాప్, మిసా భారతి ఆస్తుల వివరాలను కూడా సీబీఐ కోరింది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ ఇప్పటివరకు జరిపిన విచారణలో రూ.600 కోట్ల అక్రమ సంపాదన గురించి వెల్లడించింది.

ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న 150 కోట్ల ఇంటిని ఏబీకి విక్రయించినట్లు తేజస్వి యాదవ్‌పై ఆరోపణలు ఉన్నాయి. కేవలం నాలుగు లక్షలకు ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేశారు. కేసులో ఏజెన్సీ ఛార్జ్ షీట్‌లో యాదవ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు 14 మంది వ్యక్తులు, సంస్థలను పేర్కొంది. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలతో పాటు నేరపూరిత కుట్ర, మోసానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

లాలూ కుటుంబంపై వచ్చిన ఆరోపణ ఏంటి?

లాలూ యాదవ్ 2004-2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు వివిధ రైల్వే జోన్‌లలో గ్రూప్ 'డి' పోస్టుల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారని , ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల కోసం చాలా మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ ఉద్యోగాలు పొందిన వ్యక్తులు తమ భూమిని లాలూ కుటుంబ సభ్యుల పేరిట తక్కువ ధరకు లంచం లేదా బహుమతిగా ఇచ్చినట్లు కూడా కేసులో వెల్లడైంది.

లాలూ ప్రసాద్ , అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా మరో 15 మందిపై ఏజెన్సీ మే 18, 2022 న కేసు నమోదు చేసింది. లాలూ ప్రసాద్, రబ్రీ దేవి తదితరులపై గతేడాది అక్టోబర్‌లో సీబీఐ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇది ముంబైలోని ప్రధాన కార్యాలయంతో రైల్వే సెంట్రల్ జోన్‌లో చేసిన నియామకాలకు సంబంధించినది.