Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. సీబీఐ అదుపులో ఓన్లీ మచ్ లౌడర్‌ సీఈవో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీ సీఈవోని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీకి సీఈవోగా విజయ్ నాయర్ కొనసాగుతున్నారు. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వుంటుంది. 

CBI arrests Only Much Louder ceo vijay nair in Delhi Government Liquorgate Scam
Author
First Published Sep 27, 2022, 8:52 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీ సీఈవోని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఓన్లీ మచ్ లౌడర్‌ కంపెనీకి సీఈవోగా విజయ్ నాయర్ కొనసాగుతున్నారు. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వుంటుంది. 

ఇకపోతే.. ఈ కేసుకు సంబంధించి బుధవారం ముగ్గురిని ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వీరిలో వెన్నమనేని శ్రీనివాసరావు, సాలిగ్రామ్ టెక్నాలజీ ఎండీ, జోనా కన్సల్టెంట్ సిబ్బందిని ఈడీ అధికారులు విచారించారు. వీరు రామచంద్ర పిళ్లైతో కలిసి పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఇప్పటికే వెన్నమనేనిని కొద్దిరోజుల క్రితం దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. శ్రీనివాసరావు కంపెనీ ద్వారానే ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. వెన్నమనేని దాదాపు ఆరు కంపెనీలలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. 

ఇకపోతే.. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్ర ప్రైవేట్ లిమిటెడ్, హైద్రాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీ, వరుణ్  సన్ షోరూమ్, గోల్డ్ స్టార్ మైన్స్, మినరల్స్ అనే సంస్థలను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారు.  లిక్కర్ స్కాం  విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅరుణ్ రామచంద్రపిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావు, అభిషేక్ రావు, సృజన్ రెడ్డిలకు  శ్రీనివాసరావు సంస్థల నుండే  విమాన టికెట్లు బుక్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios