రూ. 60వేల కోట్లు మోసం చేసిన కేసులో పెరల్స్ గ్రూప్ చిట్‌ఫండ్ సంస్థకు చెందిన 11 మందిని సీబీఐ గురువారం నాడు అరెస్ట్ చేసింది. గతంలోనే ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: పెరల్స్ చిట్ ఫండ్ స్కాంలో 11 మందిని గురువారం నాడు అరెస్ట్ చేసింది సీబీఐ. దేశంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. Pearls గ్రూప్ చిట్‌ఫండ్ సంస్థ యాజమాన్యం రూ. 60 వేల కోట్ల రూపాయాలను మోసం చేసిందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసింది CBI.
ఐదు కోట్ల మంది ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడులుగా డబ్బులు సేకరించింది పెరల్స్ గ్రూప్ సంస్థ. ఈ గ్రూప్ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిర్వహించి కేసు నమోదు చేసింది.ఈ స్కాంలో పెరల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. చందర్ భూషణ్ ధిల్లాస్, ప్రేమ్ సేథ్, మన్మోహన్ కమల్ మహాజన్, మోహన్ లాల్ సెహజ్ పాల్, కన్వల్ జిత్ సింగ్ టూర్,ప్రవీణ్ కుమార్ అగర్వాల్, మనోజ్ కుమార్ జైన్, అకాష్ అగర్వాల్, అనిల్ కుమార్ ఖేమ్కా, సుభాష్ అగర్వాల్, రాజేష్ అగర్వాల్ లను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
also read:వివేకా హత్య కుట్రలో శివశంకర్ రెడ్డే ప్రధాన భాగస్వామి.. ఆధారాలు ధ్వంసం, అసత్యప్రచారం..
ఢిల్లీ, చంఢీఘడ్, కోల్‌కత్తా, భువనేశ్వర్ లలో ఈ అరెస్ట్ లు జరిగినట్టుగా సీబీఐ ప్రకటించింది. నిర్మల్ సింగ్ బాంగూ, సుఖ్‌దేవ్ సింగ్, సుబ్రతా భట్టాచార్య, గుర్మిత్ సింగ్ లను 2016 జనవరి 8న సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులపై 2016 ఏప్రిల్ 7న చార్జీషీట్ దాఖలు చేశారు.లక్షలాది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాకుల వ్యతిరేకంగా ప్రభావితం చేసిన కోట్లాది రూపాయాల ఆర్ధిక కుంభకోణంలో ఇతర నిందితులు, అనుమానితుల పాత్రను పరిశోదించడానికి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ ప్రతినిధి ఆర్‌సీ జోషీ తెలిపారు.18 ఏళ్లలో 58 మిలియన్ల పెట్టుబడిదారుల నుండి కనీసం రూ.49,100 కోట్లు అక్రమంగా వసూలు చేసినందుకు PACL ని సెక్యూరిటీస్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) 2015 లో నిషేధించింది. 2020 సెప్టెంబర్ రూ. 10 వేల వరకు క్లెయిమ్‌లతో రూ. 12 లక్షఁల కంటే ఎక్కువ పీఏసీఎల్ పెట్టుబడి దారులకు రూ. 429 కోట్లకు పైగా చెల్లించినట్టుగా సెబీ తెలిపింది.
పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు పీఏసీఎల్ దాని తొమ్మిది మంది ప్రమోటర్లు డైరెక్టర్ల ఆస్తులను అటాచ్ చేయాలని సెబీ ఆదేశించింది.2014 ఆగష్టు 22 నాటి ఆర్ఢర్ లో పీఏసీఎల్ తో పాటు దాని ప్రమోటర్లు, డైరెక్టర్లను కూడా డబ్బు వాపస్ చేయాల్సిందిగా సెబీ కోరింది. డిఫాల్టర్లు ఆర్ఢర్ ఇచ్చిన తేదీ నుండి మూడు నెలల్లోగా స్కీమ్ లను ముగించి పెట్టుబడిదారులకు డబ్బును వాపస్ ఇవ్వాలని ఆదేశించింది.
