ప్రియుడితో దొరికిన భార్య... పట్టుకున్న భర్త పురుషాంగాన్ని కొరికేసింది

Caught with lover, woman bites off husband's penis
Highlights

వెంటనే భర్త పురుషాంగాన్ని నోటితో కొరికేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్థానికులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భర్తను మోసం చేసి వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నదే కాక.. తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త పురుషాంగాన్ని నోటితో కొరికేసింది ఓ మహిళ . ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లాలోని తురాయిములాయ్ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన సీతారామయ్య(55), జయంతి(45) భార్యభర్తలు. సీతారామయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం  భార్య భర్తలు ఇద్దరూ.. గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. భర్తను అక్కడే ఉండమని చెప్పి.. ఇప్పుడే వస్తానని భార్య జయంతి... ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. భార్య ఇంకా రాకపోయే సరికి ఆమెను వెతుక్కుంటూ వచ్చిన భర్తకు.. ఆమె మరో వ్యక్తితో కనిపించింది.  

ఆ సన్నివేశం చూసి భర్త షాక్ కి గురయ్యాడు. అతను షాక్ నుంచి తేరుకోకముందే.. భార్య.. తన భర్త పురుషాంగాన్ని నోటితో కొరికేసింది.  భర్తకు దొరికేసాననే భయంతో ఆమె అలా చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్థానికులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా.. భర్తను చంపేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలతో పోలీసులు భార్య జయంతిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

loader