సినిమాల్లో క్యాస్టింగ్ డైరెక్టర్ (casting director) పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ( junior artist) పోలీసులను ఆశ్రయించింది. తనను బెదిరించి పలుమార్లు అత్యాచారినిని పాల్పడినట్టుగా తెలిపింది.
సినిమాల్లో క్యాస్టింగ్ డైరెక్టర్ (casting director) పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ( junior artist) పోలీసులను ఆశ్రయించింది. తనను బెదిరించి పలుమార్లు అత్యాచారినిని పాల్పడినట్టుగా తెలిపింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంంది. జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు ఫిల్మ్ కంపెనీలో కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పుణె పోలీసులు తెలిపారు. మంగళవారం పోలీసులకు తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన జూనియర్ ఆర్టిస్ట్.. నిందితుడికి 40 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొంది. అతనితో కలిసి కొన్ని ప్రాజెక్టులలో కలిసి పనిచేసినట్టుగా తెలిపింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలికి 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు బలవంతంగా లైంగిక సంబంధం పెటుకున్నాడు. బాధితురాలితో అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటీ (2017 మే) నుంచి 2022 మార్చి మధ్య వేర్వేరు ప్రదేశాలలో పలుమార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలి వీడియోను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
నిందితుడి నిరంతర వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు(ఇప్పుడు 21 ఏళ్ల వయస్సు) తన తల్లిదండ్రులకు అసలు విషయం తెలియజేసింది. అనంతరం మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక, నిందితుడు తనను కొట్టడమే కాకుండా.. దుర్భాషలాడాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీలోని సెక్షన్లు 376, 376 (2)(n), 354 c, 323, 504, 506లతో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడికి ఇంకా అరెస్ట్ చేయలేదని.. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
