Asianet News TeluguAsianet News Telugu

దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలి.. ఆప్ పిటిషన్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దేశద్రోహపూరిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముంబయి పోలీసులకు పిటిషన్ ఇచ్చారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను ఆప్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ నేత ప్రీతి శర్మ మీనన్ ట్వీట్ చేశారు. దేశానికి 2014లోనే స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో కేవలం బ్రిటీషర్లు భిక్షం వేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

case should be filed against kangana ranaut AAP seeks mumbai police
Author
Mumbai, First Published Nov 11, 2021, 7:26 PM IST

ముంబయి: Bollywood నటి Kangana Ranautపై కేసు నమోదు చేయాలని Aam Aadmi Party ముంబయి పోలీసులకు ఓ అప్లికేషన్ పెట్టింది. కంగనా రనౌత్ దేశద్రోహ(Treason) వ్యాఖ్యలు చేశారని, ఆమెపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ముంబయి పోలీసులను కోరింది.

కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని, దేశద్రోహపూరితమైనవని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతి శర్మ మీనన్ పేర్కొన్నారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను ఆప్ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. ఐపీసీ సెక్షన్స్ 504, 505, 124ఏ కింద కేసు నమోదు చేయాలని కోరినట్టు ట్వీట్ చేశారు.

టైమ్స్ నౌ అనే మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంగనా రనౌత్ పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ,  British పాలనకు కొనసాగింపే Congress హయాం అని అన్నారు. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని చెప్పారు. అంతేకాదు, 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదని, కేవలం భిక్షమే అని నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్ అయ్యారు.

Also Read: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం’.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్

‘మహాత్మా గాంధీ త్యాగాన్ని ఒక్కోసారి హేళన చేస్తున్నారు.. మరోసారి ఆయనను చంపేసిన వ్యక్తిని కొలుస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్.. కొన్ని లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు’ అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. దీన్ని నేను పిచ్చితనం అనాలా? లేక దేశ ద్రోహం అని పిలవాలా? అంటూ ప్రశ్నించారు. ఇది కచ్చితగా దేశ ద్రోహ చర్యే అని తెలిపారు. ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నా.. మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించడానికి రక్తాన్ని ధారపోసిన వారందరినీ మోసం చేసినవారమవుతామని అన్నారు.

Also Read: కంగనా రనౌత్ వర్సెస్ జావేద్ అక్తర్.. కంగనాకు భారీ షాక్.. ఆధారాలు లేవని ఆ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు..

తన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కంగనా రనౌత్ వివరణ ఇచ్చారు. స్వాతంత్ర్యానికి సంబంధించి ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 1857లో జరిగినదే తొలి స్వాతంత్ర్య సంగ్రామమని తాను స్పష్టంగా ప్రస్తావించారని కంగనా రనౌత్ అన్నారు. అయితే, ఆ పోరాటాన్ని బ్రిటీషర్లు దారుణంగా అణచివేశారని పేర్కొన్నారు. ఆ తర్వాతే బ్రిటీషర్ల అరాచకాలు మరింత పెరిగాయని చెప్పారని తాజాగా వివరించారు. గాంధీ అడుక్కునే రూపంలో బ్రిటీషర్లు భారతీయులకు మరో శతాబ్ద కాలాన్ని ఇచ్చారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios