Asianet News TeluguAsianet News Telugu

కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలకు ప్రికాష‌న‌రీ డోసుగా కార్బెవాక్స్.. ఆమోదించిన కేంద్రం

కార్బెవాక్స్ వ్యాక్సిన్ ను ప్రికాషనరీ డోసుగా ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం అనుమతి ఇచ్చింది. అయితే మొదటి రెండు డోసులు కోవాగ్జిన్, కోవిషీల్డ్ లో ఏది తీసుకున్నా.. మూడో డోసుగా దీనిని ఇవ్వొచ్చని పేర్కొంది. 

Carbevax as Precautionary Dose for Adults Who Have Received Covagin and CoviShield Vaccines Center Approved
Author
New Delhi, First Published Aug 10, 2022, 2:39 PM IST

కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలకు (18 ఏళ్లు పై బ‌డిన వారికి) ప్రికాష‌న‌రీ డోసుగా కార్బెవాక్స్ వ్యాక్సిన్ ను ప్రికాష‌న‌రీ డోసుగా ఇచ్చేందుకు ఆమోదం ల‌భించింది. భార‌త్ లో మొద‌టి, రెండో డోసు తీసుకున్న వ్యాక్సిన్ కాకుండా బూస్ట‌ర్ డోసుగా ఇత‌ర వ్యాక్సిన్ ను అనుమతించ‌డం ఇదే మొద‌టి సారి. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కు చెందిన COVID-19 వర్కింగ్ గ్రూప్ ఇటీవల చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ Corbevax వ్యాక్సిన్ బూస్టర్ మోతాదును బుధ‌వారం ఆమోదించింది. ఈ విష‌యాన్ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం 6 అత్యాచార కేసులు నమోదు: పోలీసు గణాంకాలు

‘‘18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు Covaxin లేదా Covishield వ్యాక్సిన్  రెండో డోసు వేసుకొని ఆరు నెలలు లేదా 26 వారాలు పూర్తి చేసిన తర్వాత కార్బెవాక్స్ ముందు జాగ్రత్త మోతాదుగా ఇవ్వ‌వ‌చ్చు. దీని వ‌ల్ల Corbevax ను వైవిధ్యమైన COVID-19 వ్యాక్సిన్‌గా ఉపయోగించడం సాధ్యమవుతుంది. ’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి. 

2022 ఫిబ్రవరిలో బయోలాజికల్ ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసిన Corbevax 12-18 సంవత్సరాల వయస్సు గల వారికి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) కోసం DCGI ఆమోదం పొందింది. జూన్ 4వ తేదీన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కార్బెవాక్స్‌ను 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి ముందు జాగ్రత్త మోతాదుగా ఆమోదించింది. Corbevax అనేది COVID-19 కోసం భారతదేశం మొట్టమొదటి స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (RBD) ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్. 

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

కాగా.. నేటి ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక నివేదికల ప్రకారం భారత్ లో COVID-19 టీకా కవరేజీ 207.03 కోట్లు (2,07,03,71,204) మించిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 2,74,83,097 సెషన్ల ద్వారా సాధ్యమైందని పేర్కొంది. కాగా.. 2022 మార్చి 16వ తేదీన 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి COVID-19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 3.96 కోట్ల (3,96,04,796) మంది టీనెజర్లకు COVID-19 వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను అందించారు. అదే విధంగా 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి COVID-19 ప్రికాషనరీ డోసు కూడా ఏప్రిల్ 10, 2022 నుండి ప్రారంభమైంది.

‘జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం’ వీడియోపై బీజేపీ ఎంపీ ఫైర్.. సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు

ఇదిలా ఉండ‌గా.. ఈ ఏడాది మొద‌టి నుంచి జూలై 19 వరకు భారతదేశంలో 45,000 కంటే ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం లోక్ స‌భ‌లో వెల్ల‌డించింది. ఇందులో 22 000 కంటే ఎక్కువ కేసులు కేర‌ళ నుంచే ఉన్నాయ‌ని చెప్పింది. త‌రువాత మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయ‌ని పేర్కొంది. కేర‌ళ‌లో ఈ ఏడాది మొత్తంగా 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 13 లక్షల కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో దాదాపు 10 లక్షల కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో జూలై 19 వరకు దాదాపు 8 లక్షల కోవిడ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios