ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ ఇంకా పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకముందే కారు స్టీరింగ్ పట్టుకుంది. రివర్స్ గేర్‌లో వెనుకాలే వరుసగా పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లపైకి కారు ఎక్కించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డ్రైవింగ్ అనే నైపుణ్యాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు. కానీ, కొందరు పూర్తిగా నేర్చుకోకముందే వాహనాలను చేతబడతారు. అలా చేయడం వల్ల వారితోపాటు చుట్టుపక్కల వారికీ ప్రమాదమే. క్షణకాలంలో జరిగిపోయే ప్రమాదాలు, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలు పక్కనపెడితే.. ఆ మహిళ మాత్రం స్వయంగా కారులో స్టీరింగ్ చేతిలో పట్టుకుని వెనుకన పార్క్ చేసిన బైక్‌లపైకి కారును ఎక్కించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డ్రైవింగ్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్న ఓ మహిళ తన కారును పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లపైకి ఎక్కించింది. అప్పుడు ఆ కారు రివర్స్ గేరులో ఉన్నది. ఆ కారు నాటకీయంగా వరుసగా పార్క్ చేసిన బైక్‌లపైకి వెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ నెలలోనే జరిగింది. ఈ ఘటనలో డజను వరకు బైక్‌లు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన జరగ్గానే చాలా మంది అక్కడ గుమిగూడారు. ఆమె డ్రైవింగ్ పై విరుచుకుపడ్డారు. మరికొందరు ఆమెను శాంతింపజేసేలా మాట్లాడారు. ఆమె ఇదంతా చేసి ఉంటే ఇంకా అలాగే కారును తిప్పుతుండవచ్చు. ఎవరైనా ఎందుకు ఆ కారును అదుపులోకి తీసుకుని మెల్లిగా ఆ బైక్‌లపై నుంచి కిందికి దింపరు? అంటూ ఒకరు అడిగారు. మరొకరు మాత్రం.. జాగ్రత్తగా.. మెల్లిగా కారును కిందికి దింపమ్మా అంటూ సూచన చేశారు.
అయితే, ఆమె ఆ బైక్‌ల పై నుంచి కారును దింపింది. అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలాగే ఆమె వ్యవహరించారు.
ఆమెనే స్వయంగా ఫజల్‌గంజ్ పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. ఆమె పై ఓ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రూ. 2,500 జరిమానా కూడా పడింది. అయితే, ఉభయ పక్షాల మధ్య పోలీసుల సమక్షంలోనే సెటిల్‌మెంట్ జరిగింది.
