Asianet News TeluguAsianet News Telugu

కారు డాక్యుమెంట్లు చూపెట్టాలన్న కానిస్టేబుల్ కిడ్నాప్.. అదే కారులో.. డ్రైవర్ అరెస్ట్

కారు డాక్యుమెంట్లు చూపెట్టాలని అడిగిన కానిస్టేబుల్‌ను డ్రైవర్ కారులోపటికి ఆహ్వానించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారులోకి వెళ్లగానే డోర్ లాక్ చేసి డ్రైవర్ వేగంగా కారును తీసుకుపోయాడు. ఓ పది కిలోమీటర్ల తర్వాత వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆదివారం చోటుచేసుకుంది. 
 

car driver kidnapped traffic constable for asking documents
Author
Noida, First Published Oct 19, 2021, 4:21 PM IST

నోయిడా: రోడ్డుపై వస్తున్న ఓ కారును ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. డోర్‌పై కొట్టి కారు డాక్యుమెంట్స్ చూపెట్టాల్సిందిగా డ్రైవర్‌ను అడిగాడు. డోర్ తీసి లోపలికి వచ్చి డాక్యుమెంట్లు పరిశీలించుకోవాల్సిందిగా డ్రైవర్ సూచించాడు. కానిస్టేబుల్ కారులో అడుగుపెట్టగానే డోరు లాక్ చేసి స్పీడ్‌గా దూసుకెళ్లాడు. ఓ పది కిలోమీటర్లు కానిస్టేబుల్‌ను వెంట తీసుకెళ్లి ఓ చెక్ పోస్టు దగ్గర తోసేసి పరారయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నోయిడాలో ఆదివారం చోటుచేసుకుంది.

గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ రావల్ గుర్గావ్‌లోని ఓ షోరూమ్‌లో కారు కొనుగోలుకు వెళ్లాడు. మారుతీ స్విఫ్ట్ డిజైర్‌ను దొంగిలించాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానని అటు నుంచి అటే కారుతో చెక్కేశాడు. నకిలీ నెంబర్ ప్లేట్‌తో ఆ కారును నడుపుకుంటున్నాడు. ఆ కారుతో సచిన్ రావల్ సూరజ్‌పూర్ వైపు వస్తున్నట్టు పోలీసులకు తెలిసింది. అక్కడే వెహికిల్ చెకింగ్ క్యాంప్ చేస్తున్నారు. అటువైపు సచిన్ రావల్‌ను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ ఆపారు.

Also Read: బెంగళూరులో దారుణం: మహిళపై క్యాబ్ డ్రైవర్ రేప్, నిందితుడు ఆంధ్రావాలా

కారు డాక్యుమెంట్లు చూపెట్టాల్సిందిగా డ్రైవర్ సచిన్ రావల్‌ను కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ అడిగాడు. కారు డాక్యుమెంట్లు సాఫ్ట్ కాపీలున్నాయని, తన మొబైల్ చూడటం కోసం కారులోపటికి రావలసిందిగా కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్‌ను సచిన్ రావల్ కోరారు. కానిస్టేబుల్ సింగ్ ఆ సాఫ్ట్ కాపీ చూడటానికి కారులోకి వెళ్లాడు. కారులోకి సింగ్ వెళ్లి కూర్చోగానే సచిన్ రావల్ కారు డోరు వేసి వేగంగా తీసుకుపోయారు.

అక్కడి నుంచి పదికిలోమీటర్ల దూరంలోని అజయబ్ పూర్ పోలీసు చౌకీ దగ్గర కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్‌ను సచిన్ రావల్ దింపేసి అంతే వేగంగా పరారయ్యాడు. సచిన్ రావల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారమే ఆయనను అరెస్టు చేశారు. ఆ కారునూ జప్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios