Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో దారుణం: మహిళపై క్యాబ్ డ్రైవర్ రేప్, నిందితుడు ఆంధ్రావాలా

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. జార్ఖండ్ కు చెందిన మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు.

Cab driver molests Jharkahan woman in Bengaluru: Accused from AP
Author
Bengaluru, First Published Sep 23, 2021, 7:45 AM IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన జరిగింది.  ఊబర్ క్యాబ్ లో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఈ సంఘటన కర్ణాటక శాసనసభలో దుమారం రేపింది. నిందితుడిని పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి చెందిన దేవ్ రాజ్ గా గుర్తించారు. 

కొన్నేళ్లుగా జార్ఖండ్ కు చెందిన మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉండే తన స్నేహితురాలి ఇంటికి మంగళవారం రాత్రి విందుకు వెళ్లింది. పార్టీ ముగిసిన తర్వాత మురుగేశ్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు బుధవారం తెల్లవారు జామున ఊబర్ క్యాబ్ ను బుక్ చేసుకుంది. 

Also Read: ట్యూషన్ కోసం వచ్చిన బాలికను గర్భవతిని చేసిన మాస్టారు..!

క్యాబ్ లో తన ఇంటి సమీపానికి చేరుకున్న తర్వాత డ్రైవర్ ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను క్యాబ్ లోంచి తోసేసి వెళ్లిపోయాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేవరాజ్ ను అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. 

క్యాబ్ ఎక్కిన వెంటనే బాధితురాలు నిద్రపోయిందని, దాన్ని ఆసరా చేసుకుని నిందితుడు క్యాబ్ ను ఆమె ఇంటి సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడని, అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. క్యాబడ్ ను దేవరాజ్ దాదాపు 20 నిమిషాల పాటు ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచినట్లు పోలీసులు కనిపెట్టారు. ఇతర ఆధారాలను కూడా సేకరించారు. 

ఆ ఘటన సెగ శాసనభలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తాకింది. ఆగస్టు 24వ తేీదన మైసూరులో జరిగిన అత్యాచార ఘటనతో పాటు తాజా ఘటనను కూడా ప్రతిపక్షాలు అసెంబ్లీలో లేవనెత్తాయి. కేసుల దర్యాప్తులో జాప్యం జరగబోదని, నేరం నిర్ధారణ అయిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బొమ్మై హామీ ఇచ్చారు. 

ఇదిలావుంటే, క్యాబ్ డ్రైవర్ దేవరాజు వాదన మహిళ ఫిర్యాదుకు భిన్నంగా ఉంది. తాను అలాంటి వాడిని కానని, క్యాబ్ లో ఎక్కడానికి ముందు ఆమె మద్యం మత్తులో ఉందని, ఇల్లు వచ్చింది దిగమన్నా పట్టించుకోలేదని అతను చెప్పాడు. తాను కారులోంచి దించానని, కారు కిరాయి కూడా ఇవ్వలేదని, తిరిగి తనపైనే ఫిర్యాదు చేసిందని అతను చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios