Asianet News TeluguAsianet News Telugu

కరోనా బాధితులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేం: సుప్రీంకు తేల్చిచెప్పిన కేంద్రం

కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తాన్ని వాటికే కేటాయించాల్సి వుంటుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది

Cant Give Rs 4 Lakh For Covid Victims Centre Tells Supreme Court ksp
Author
New Delhi, First Published Jun 20, 2021, 4:27 PM IST

కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తాన్ని వాటికే కేటాయించాల్సి వుంటుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు సహాయంగా పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర  ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే ఎస్‌డీఆర్ఎఫ్ నిధులన్నీ వారికే ఖర్చు చేయాల్సి వుంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read:రానున్న 6 నుండి 8 వారాల్లో కరోనా థర్డ్‌వేవ్: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

ఒకవేళ అలా చేస్తే కరోనా వైరస్ విజృంభణ సమయంలో అత్యవసర వైద్య సేవలు, పరికరాలను సమకూర్చుకోవడం లేదా తుఫానులు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వద్ద సరిపడా నిధులు వుండవని తెలిపింది. ఒకవేళ కరోనాకు పరిహారం చెల్లిస్తే ఇతర వ్యాధుల్ని నిరాకరించడం అన్యాయమే అవుతుందని అభిప్రాయపడింది. కేవలం వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులకు మాత్రమే విపత్తు సహాయం వర్తిస్తుందని సుప్రీంకోర్టుకు వివరించింది కేంద్రం. 

Follow Us:
Download App:
  • android
  • ios