భర్తకు క్యాన్సర్.. శృంగారానికి ఒప్పుకోని భార్య.. గొంతు కోసిన భర్త

Cancer patient kills wife in Noida for refuses to have sex
Highlights

శృంగారానికి నిరాకరించిందని భార్యను గొంతుకోసి చంపేశాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన అజయ్ క్షురకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని  పోషిస్తున్నాడు.. 

శృంగారానికి నిరాకరించిందని భార్యను గొంతుకోసి చంపేశాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన అజయ్ క్షురకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని  పోషిస్తున్నాడు.. ఈ క్రమంలో ఏడాది క్రితం అతనికి నోటీ క్యాన్సర్ ఉన్నట్లుగా  వైద్యపరీక్షల్లో తేలింది. అప్పటికే క్యాన్సర్ బాగా ముదిరిపోయింది.. ఎంతలా అంటే నోటి దవడకు రంధ్రం పడేంతగా.  దీంతో చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నాడు అజయ్..

ఈ  క్రమంలో కుటుంబపోషణ నిమిత్తం అతని భార్య మమత ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంది.. నోయిడాలోని తన సోదరుడి ఇంట్లో ఉంటూ ఉద్యోగ యత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న భార్య వద్దకు వెళ్లిన అజయ్.. శృంగారంలో పాల్గొనాల్సిందిగా మమతపై ఒత్తిడి తెచ్చాడు.. దీనికి ఆమె ఒప్పుకోలేదు.. దీంతో కోపంతో ఊగిపోయిన అజయ్ తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు.
 

loader