Canadian PM Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించడంతో ఆయ‌న క‌రోనా  నిర్ణార‌ణ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది.   

Canadian PM Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరోసారి కరోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న సోమవారం COVID-19 నిర్థార‌ణ పరీక్ష‌లు చేయించుకోగా.. అందులో పాజిటివ్ తెలింది. దీంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో ఉంటూ.. చికిత్స తీసుకుంటున్నారు. వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయడం ఎంత ముఖ్యమో పునరుద్ఘాటిస్తూ.. నేను బాగానే ఉన్నాను, కానీ, పూర్తి స్థాయిలో టీకాలు వేచించుకోలేకపోయాను. కాబట్టి, మీరు టీకాలు వేయించుకోక‌పోతే.. టీకాల‌ను వేయించుకోండి. అని తెలిపారు.

 కెనడా ప్రధాన మంత్రి క‌రోనా బారిన ప‌డ‌టం ఇది రెండవసారి. ట్రూడో చివరిసారిగా జనవరిలో ప‌రీక్షించుకోగా.. COVID-19 పాజిటివ్ అని తెలింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన సమ్మిట్ ఆఫ్ అమెరికాస్‌లో యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఇతర నాయకులను కలిసిన తర్వాత చేయించుకున్నక‌రోనా పరీక్షలో క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయ్యింది. బిడెన్ శుక్రవారం ట్రూడోతో "ఫ్యామిలీ ఫోటో" తీసుకున్నాడు

కెనడా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేసే దేశాల్లో ఒకటిగా ఉంది - ఈ షాట్‌లు ప్రధానంగా వ్యాధి సోకిన వారిని తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా ఉంచేందుకు రూపొందించబడ్డాయి.

Scroll to load tweet…